జ‌న‌సేన రిక్రూట్ మెంట్ స్టార్ట్ అయ్యింది

Update: 2017-03-28 10:26 GMT
2019 సార్వ‌త్రిక ఎన్నిక నేప‌థ్యంలో.. ఏమాత్రం బేస్ లేని పార్టీకి కొత్త శ‌క్తియుక్తులు తీసుకొచ్చేందుకు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త ప‌ద్ధ‌తిని ఎంచుకున్న‌ట్లుగా కనిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము బ‌రిలోకి దిగుతామ‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత మాట‌ల‌పై చాలానే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. పార్టీలో స‌రైన నేత లేక‌పోవ‌ట‌మే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం ప‌ట్టులేని పార్టీ ఎలా బ‌రిలోకి దిగుతుంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇదిలా ఉంటే.. మిగిలిన రాజ‌కీయ పార్టీల‌కు భిన్నంగా జ‌న‌సేన తాజాగా రిక్రూట్ మెంట్ నోటిఫికేష‌న్ ను ప్ర‌క‌ట‌న రూపంలో జారీ చేసింది. పార్టీలో యువ‌త‌కు ప్రాధాన్యం ఇస్తామ‌న్న పార్టీ.. జ‌న‌సేన‌కు అవ‌స‌ర‌మైన సైనికుల కోసం తాము హృద‌య‌పూర్వ‌క ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్లుగా పేర్కొన్నారు.

‘‘జనసేన పార్టీలోని వివిధ విభాగాల్లో జన సైనికులను భాగస్వాములను చేసే కార్యక్రమం ప్రారంభమవుతోంది. పార్టీ తరపున గొంతెత్తడానికి స్థానిక సమస్యలపై, రాష్ట్రస్థాయి సమస్యలపై సమగ్రమైన అవగాహన ఉన్నవారిని స్పీకర్స్ గాను, రైటింగ్ స్కిల్స్ ఉన్నవారిని కంటెంట్ రైటర్స్ గాను, చక్కటి విశ్లేషణలను చేయగలవారిని అనలిస్టులుగా పార్టీకి సేవలందించేందుకు జనసేన ఆహ్వానం పలుకుతోంది. మిమ్మల్ని మీ ప్రాంతంలోనే కలుసుకుని మాట్లాడేందుకు జనసేన బృందం హైదరాబాద్ నుంచి మీ జిల్లాకు వస్తోంది. ఈ కార్యక్రమం ముందుగా అనంతపురం జిల్లా నుంచి ప్రారంభం అవుతుంది" అని పేర్కొన్నారు.

మొద‌ట అనంత‌పురంతో మొద‌ల‌య్యే ఈ రిక్రూట్ మెంట్ ప్రోగ్రాం త‌ర్వాతికాలంలో అన్ని జిల్లాల‌కు విస్త‌రించ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. తాము కోరుకున్న మూడు పోస్టులు (1. స్పీక‌ర్ 2. కంటెంట్ రైట‌ర్ 3. అన‌లిస్ట్‌) కోసం ఆస‌క్తి ఉన్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చన్నారు. ఇందుకోసం ఒక వెబ్ లింక్ ఇచ్చి.. ప్రాధాన్య‌త తెలియ‌జేయాల‌ని కోరారు. www.janasenaparty.org/resourcepersons ను లాగిన్ చేసి.. ప్రాధాన్య‌తల్ని పేర్కొనాల‌న్న పార్టీ.. ప్ర‌స్తుతానికి అనంత‌పురం అభిమానుల‌కు మాత్ర‌మే ఈ అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. మ‌రీ.. రిక్రూట్ మెంట్ వ్యూహం జ‌న‌సేనకు ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క్ వుట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News