పవన్ పార్టీ సైలెంట్ వర్క్ సాగిపోతోంది

Update: 2016-12-30 09:40 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాబోయే చిత్రం కాటమరాయుడుతో బిజీ ఉండటం వల్ల రాజకీయాలవైపు - తన పార్టీ వైపు దృష్టిసారిస్తున్నట్లుగా కనిపించనప్పటికీ ఆయన కార్యకర్తలు మాత్రం వేగంగా ముందుకు సాగుతున్నారు. 2017  నుంచి జనసేన కార్యకర్తలుగా జనసేన ఆశయాలను ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలి, జనసేన కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలను ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి అన్న దానిపైనే కార్యకర్తల సమావేశం కొనసాగింది. ఆ పార్టీ నేత మద్దిల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించి ఈ భేటీకి ముఖ్య అతిధిగా జనసేన రాష్ట్ర కార్యకర్త పోతిన వెంకట మహేష్‌ పాల్గొని ఈ సందర్భముగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆశయాలు చ‌ర్చించారు.

పవన్‌ కల్యాణ్‌ ని వాడుకుని అధికారంలోనికి వచ్చిన తెలుగుదేశం - బీజేపీలు పవన్‌ కల్యాణ్‌ ని విమర్శిస్తే వారికి తప్పక బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా కార్యకర్తలు నిర్ణయించారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల కష్టాలు మరింత పెరిగాయని, వారి ఆర్ధిక స్వేచ్ఛను బీజేపీ హరించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయములో కూడా కాంగ్రెస్‌ మాదిరిగానే బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్‌ కు తీవ్ర అన్యాయం చేసిందని, కాబట్టి బీజేపీని కూడా ఆంధ్రప్రదేశ్‌ లో భూస్థాపితం చేయాలని కార్యకర్తలు చర్చించుకున్నారు. 2019 ఎన్నికలలో అసెంబ్లీలో జనసేన జెండా ఎగరవేయాలని, పవన్‌ కల్యాణ్‌ ని సీఎంగా చేసేంత వరకు కార్యకర్తలుగా అందరం కష్టించి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయాలని అందుకు యువత అంతా విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

పవన్ సిద్ధాంతాలుగా జనసేన పేర్కొన్న అంశాలు ఇవే

-చట్టాన్ని అందరికి సమానంగా వర్తించాలి. (బలవంతుడికి ఒకలాగా - బలహీనులకు మరొకలాగ అమలు కాకూడదు).

- బ్లాక్‌ మార్కెట్‌ ను దశల వారీగా నిర్మూలించడం

-స్త్రీలకు రక్షణ & ఆర్ధిక భరోసా కల్పించడం

-సామాన్యులకు నాణ్యమైన విద్య - వైద్యం అందించాలి

- దేశ సమగ్రత - శ్రేయస్సు - యువ నాయకత్వాన్ని పెంపొందించడం

-ప్రకృతి సమత్యుతను కాపాడడం అనే ఆశయాలను ప్రజలకు చేరువ చెయ్యాలి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News