ఏపీలో జనసేన దుకాణం త్వరలోనే బంద్ కానుందా.. రాజకీయాల్లో తన అన్న చిరంజీవి దారిలోనే పవన్ కూడా న డువనున్నాడా.. ప్రశ్నిస్తాడనుకున్న జనసేనాని పార్టీ జెండాను పీకేసేందుకు రెడీ అయ్యాడా.. జనసేనను ఏదైనా పార్టీలో విలీనం చేస్తాడా ? లేక అసలు పార్టీనే మూసివేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాడా..? ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ తాను ప్రజల మధ్యే ఉంటానని, సమస్యలపై పోరాడుతానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు రావడానికి కారణమేంటి..?
అయితే ఇటీవల వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పార్టీని నడపడం కష్టమనే ఆలోచనకు పవన్ వచ్చారని - ఇటీవల ఆయన మీడియా ఎదుట వ్యాఖ్యలే ఇందుకు నిదర్శమని ఉదహరిస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ - కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో మిలాఖత్ కాబోతున్నాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని పలు పత్రికలు ప్రచురించగా - జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. నాయకులు - కార్యకర్తలను ఆలోచనలో పడేశాయి.
‘జాతీయ పార్టీలు పిలుస్తున్నాయి’ అంటూ ఇటీవల నర్మగర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు పవన్. ఈ ఎన్నికల్లో తనకు తనకు సంతృప్తికరమైన ఓట్లు రావడం చాలా సంతోషంగా ఉన్నదని మురిసిపోతున్న పవన్ కళ్యాణ్.. జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోడానికి చాల ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాలో బీజేపీ వ్యూహకర్త రాంమాధవ్ తో సమావేశమవడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అయితే పవన్ రామ్ మాధవ్ నుంచి సానుకూలంగా హామీలను పొందినట్లుగా కనిపిస్తోంది. అమెరికా నుంచి తిరిగివచ్చాక ఏర్పాటు చేసిన తొలి విలేకరుల సమావేశంలోనే ఈ విష యాన్ని పవన్ స్వయంగా వెల్లడించడం గమనార్హం.
‘జనసేనను ఎందులోనూ విలీనం చేయను’ అని కూడా పవన్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో పవన్ నాలుగేళ్లుగా పార్టీని నడపడమే కష్టంగా ఉంది. జనసేనతో ఒంటరి పోరు చేసి సాధించేది ? ఏమి లేదన్న నిర్ణయానికి కూడా ఆయన వచ్చేశారు. తానే రెండు చోట్ల పోటీ చేసి కనీసం ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో పవన్‌కు తన సత్తాపై ఓ క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ వరుస చూస్తుంటే రేప్పొద్దున్న పార్టీని రద్దు చేసి.. కమలదళంలో కలిపేసినా ఆశ్చర్యంలేదని చర్చించుకుంటున్నారు.
‘ప్రజావసరాల కోసం - రాజకీయ స్థిరత్వం కోసం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం’’గా పవన్ దానిని అభివర్ణించుకున్నా ఆశ్చర్యంలేదని ఆపార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. తన కాపు కులం ఓట్లకు దళితుల ఓట్లను కూడా కూడగట్టుకుంటే.. అధికారంలోకి రావచ్చని కలలుగన్న పవన్ కళ్యాణ్ - దళిత ముద్ర ఉన్న బీఎస్పీతో పొత్తు పెట్టకున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో స్థిరమైన ఆలోచనా విధానం.. కనీస సైద్దాంతిక దృక్పదం ఏమాత్రం లేని పవన్ కళ్యాణ్ ఇక బీఎస్పీ తీవ్రంగా వ్యతిరేకించి బీజేపీతో చెట్టపట్టాలు వేసుకోడానికి ఉబలాటపడుతున్నారనే విశ్లేషకులు భావిస్తున్నారు.