రాజకీయాలంటే అంత ఆషామాషీ కాదు. అందులోనూ ప్రత్యక్ష రాజకీయాలు మరీనూ. దిగితేనే ఆ లోతు తెలుస్తుంది. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ కూడా రాజకీయాల్లోకి దిగినా ఇంకా ఒడ్డునే ఈతకొడుతుతన్నారు. అది కూడా నడుంకు తాడు కట్టుకుని ఈదుతున్నట్లుగా ఉంది. ప్రవాహం మధ్యలోకి వెళ్లేందుకు ఆయన సాహసించలేకపోతున్నారని.. ఇంకొంత కాలం ఒడ్డును పట్టుకునే వేలాడే ఆలోచనలో ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు. 2019 ఎన్నికలకు సన్నద్ధమవడంలో ఆయన విఫలమవుతున్నారంటున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంత ఈజీ కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అర్థం అయిందంటున్నారు. అందుకే ఆయన కేవలం ట్విట్టర్ ద్వారానే పార్టీని నడుపుతున్నారని.. పైసలు తీయడం లేదని చెబుతున్నారు. పార్టీకి ఇపుడు అభిమానులు ఉన్నారు గానీ వారు రాజకీయ నాయకులు కారు. వారంతా సినిమా అభిమానులే. అయితే వారిని ఓట్లుగా ఎలా మలచుకోవాలనే దానిపై పవన్ దగ్గర సరైన వ్యూహం లేదు. గతంలో ఆయన సోదరుడు చిరంజీవి కూడా ఇలాంటి తప్పిదమే చేసినా కొన్ని సీట్లు వచ్చాయి. కొంతకాలం పార్టీని నడిపారు. కానీ జనసేన ఆమాత్రం కూడా నడపలేకపోతోంది. అసలు అధినేత ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్నారు.
మరోవైపు పవన్ వచ్చే రెండేళ్లకు చేతినిండా సినిమాలు పెట్టుకున్నాడు. మొత్తం నాలుగు సినిమాలు సెట్సు మీదకు వెళ్లనున్నాయి. వాటిని పూర్తి చేయకుండా ఆయన ఎలాంటి పనులూ చేపట్టలేరు. ఈ నాలుగు సినిమాలూ పూర్తయ్యేసరికి 2019 సంవత్సరం వస్తుంది. అపుడే ఎన్నికలు కూడా వస్తాయి. దీంతో పార్టీ నిర్మాణంపై ఆయన ఎంతవరకు దృష్టి పెట్టగలరన్నది అనుమానమే. కాబట్టి కాబట్టి 2019నాటికి ఎన్నికల్లో జనసేన ఆటలో అరటిపండే అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/