ప‌వ‌న్ తెలంగాణ టీం వివ‌రాలివే....

Update: 2016-11-05 15:19 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ కళ్యాన్ త‌న తెలంగాణ టీంను ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆ ముగ్గురిపై అంద‌రికీ ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో వారి వివ‌రాలు ఇవే...

తెలంగాణ బాధ్యుడిగా ప్ర‌క‌టించిన‌ నేమూరి శంక‌ర్ గౌడ్ గురించి జ‌న‌సేన ఈ విధంగా వెల్ల‌డించింది. ప‌వ‌న్ స్థాపించిన కామన్ మ్యాన్ ప్రాటెక్షన్ ఫోర్స్ (CPF) తో నేమూరి శంకర్ గౌడ్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ లోని బోరబండలో జన్మించిన శంకర్ గౌడ్‌ బాల్యం నుంచే ఆటలు - సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. పవన్ కళ్యాణ్‌ చేసే సేవా కార్యక్రమాలంటే అమితమైన అభిమానం - అనురాగంతో ఉండేవారు. ఒక వైపున వ్యాపార రంగంలో బిజీగా ఉంటూనే మరో పక్క పవన్ కళ్యాణ్‌ తో  పాటు సేవ రాజకీయాల్లో పనిచేశారు. 2008లో ప్రజారాజ్యం ఆవిర్భవించిన తరువాత పవన్ అడుగుజాడల్లో శంకర్ చురుకైన కార్యకర్తగా పనిచేశారు. యువరాజ్యంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కో-ఆర్డినేటర్ గా ప్రభావవంతమైన పాత్రను పోషించారు. 2009 అసెంబ్లీ ఎలక్షన్ సంద‌ర్భంలో జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం వచ్చినా, నాటి సమీకరణలో భాగంగా ముస్లిం అభ్యర్ధికి టికెటూ ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడినప్పడు - తనకు అనుకున్న టికెట్టు ముస్లిం అభ్యర్ధికి అప్పగించి విశాల హృదయాన్ని చాటుకున్నారని జ‌న‌సేన ప్ర‌శంసించింది..

శంకర్ గౌడ్ 2009 ఎన్నికలలో రాష్ట్ర పర్యటనలో పవన్ వెంట తిరుగుతూ పార్టీకి ఎనలేని సేవలు అందించారని గుర్తించింది. తరువాత వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో వెంగళరావు నగర్ డివిజన్‌ కు ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసినప్పటికీ పార్టీని సమ్ముకుని రాజకీయాల్లో కొనసాగారు. కాంగ్రెస్‌ లో ప్రజారాజ్యంను విలీనం చేసిన తరువాత పవన్ అనుచరునిగా కొనసాగుతూ ఆయన వెన్నంటే ఉంటూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొంది. పవన్ జనసేన పార్టీని స్థాపించినప్పటినుండి పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని వివ‌రించింది.  తిరుపతి - కాకినాడ బహిరంగ సభ ఏర్పాట్లలో తనవంతు కృషి చేశారని, గత 14 ఏళ్లుగా పవన్ అడుగుజాడలో రాజకీయ ప్రస్తానాన్ని అనుసరిసూ రాజకీయాల్లో శంకర్ గౌడ్ కొనసాగుతున్నార‌ని తెలిపింది.
------

పార్టీ ఉపాధ్య‌క్షుడిగా ఎంపికైన మ‌హేంద‌ర్ రెడ్డి వివ‌రాలు ఇవి...

సికింద్రాబాద్‌ లో జ‌న్మించిన మ‌హేంద‌ర్ రెడ్డి విద్యాభ్యాసం ముగిసిన త‌ర్వాత ప‌వ‌న్ స్థాపించిన కామ‌న్ మ్యాన్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌లోచురుకుగా ప‌నిచేశారు. 2008లో ప్రజారాజ్యం ఆవిర్భావం తరువాత యువరాజ్య పగ్గాలను పవన్ కళ్యాణ్‌ చేపట్టడంతో మహేందర్ రెడ్డి కూడా యువరాజ్యంలో మమేకమయ్యారు. పవన్ వెన్నంటే ఉంటూ ఆయన పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోను - ప్రతి సభలోనూ చురుకుగా పాల్గొన్నారు. యువరాజ్యం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి - పవన్ మన్ననలను పొందారు. అంతకుముందు 2007లో వ్యాపారంలో కాలుపెట్టి - వ్యాపారం విజయవంతంగా నిర్వహించడంతో తన అంచనాల కంటే ఎక్కువ లాభాలు వచ్చాయి. తనకు వచ్చిన ఆధాయములో కొంత భాగాన్ని ఆపన్నులకు - దాన ధర్మాలకు ఉపయోగించాలని భావించి బాలాజీ సేవా సమితిని ప్రారంబించారు. అనాద శరణాలయాలు - వృద్ధాశ్రమాలకు తన వంతు సాయాన్ని అందించారు. శిరోద్ధరణకు గురైన కొన్ని ఆలయాలకు విరాళాలు అందిచారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందున పవన్ అనేక సార్లు అభినందనలు తెలియజేశారు. 2009 ఎన్నికల సంధర్భంలో మెదక్ లోక్ స‌భ స్థానానికి పోటీచేయమని ప్రజారాజ్యం పార్టీ ఆదేశించడంతో పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి పొటీలోనికి దిగుదామనుకున్నారు. అయితే వర్గ సమీకరణంలో భాగంగా ఆ స్థానాన్ని ముస్లింలకు కేటాయించాలని నిర్ణయించడంతో చివరి నిమిషంలో మహేందర్ రెడ్డి పోటీ నుంచి మానుకొని ముస్లిం అభ్యర్థికి సీటు అప్పజెప్పారు.

మహేందర్ రెడ్డి తల్లి నాగమణి - రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని డిపోచంపల్లి సర్పంచ్‌ గా పనిచేసి గ్రామస్తుల మన్ననలను అందుకున్నారు. తల్లి రాజకీయ స్పూర్తితోని మహేందర్ రెడ్డి సేవచేయాలనుకొని అనంతరం ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా పనిచేసూ పవన్ కళ్యాణ్‌ బాటలో పనిచేసూ వచ్చారు. 2014లో జనసేన పార్టీ ఆవిర్భావంతో మహేందర్ రెడ్డి ఆ పార్టీలో మమేకమయ్యారు. గత రెండున్నర సంవత్సరాలుగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి పార్టీ ఆవిర్భావ సభల సమయంలోను ఆ తరువాత తిరుపతి - కాకినాడ సభలు ఏర్పాట్లలోను తనవంతు పాత్రను పోషించారు. పవన్ కళ్యాణ్‌ రాజకీయ ప్రయాణం గురించి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఒక్కసారి ఆయనను నమ్మితే వారిని ఆయన జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు అన్నారు. ఈ రాజకీయ జీవితం పవన్ పెట్టిన భిక్ష అని - దానిని జీవితాంతం కాపాడుకుంటానని శ్రీ మహేందర్ రెడ్డి తన అభిమానాన్ని చాటుకుంటుంటారు.
-------

మీడియా ఇంచార్జీ పి.వెంక‌టేశ్వ‌ర్ రావు ప్రొఫైల్

ఈనాడులో 1985లో కెరీర్ ప్రారంభించిన వెంక‌టేశ్వ‌ర్ రావు అనంత‌రం ఈటీవీలో ప‌నిచేసి ఆ త‌ర్వాత తిరిగి ఈనాడుకు వ‌చ్చారు. 2012 నుంచి 2015 వ‌ర‌కు సీవీఆర్ హెల్త్‌ ఛానెల్ అధిప‌తిగా పనిచేశారు. అనంత‌రం పార్టీకి సేవ‌లు అందిస్తున్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News