మోదీది అంత గొప్ప హృద‌య‌మా ప‌వ‌న్?

Update: 2018-11-06 11:53 GMT
ఓ వైపు -....తాను బీజేపీకి భ‌య‌ప‌డ‌డం లేద‌ని - ప్ర‌ధాని మోదీ అంటే త‌న‌కు భ‌యం లేద‌ని జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లుమార్లు నొక్కివ‌క్కాణించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు...మోదీని ప‌ల్లెత్తు మాట‌నుకుండా...బీజేపీని విమ‌ర్శించ‌కుండా ప‌వ‌న్ కాలం వెళ్ల‌దీస్తోండ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతోన్న సంగ‌తి కూడా తెలిసిందే. ఇప్ప‌టికే బీజేపీ-జ‌న‌సేనల మ‌ధ్య చీక‌టి ఒప్పందం కుదిరింద‌ని...అందుకే మోదీని ప‌వ‌న్ విమ‌ర్శించ‌డం లేద‌ని టాక్ ఉంది. ఆ పుకార్ల‌కు బ‌లం చేకూరేలా తాజాగా మోదీకి ప‌వ‌న్ ఓ లేఖ రాశారు. తిత్లీ తుపాను బాధితుల‌కు - ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల‌కు సాయం చేయాల‌ని `విన‌మ్రుడై` మోదీకి ప‌వ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. అంతేకాదు - తాను ప్ర‌ధానికి రాసిన లేఖ స్క్రీన్ షాట్ల‌ను ప‌వ‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో, ఆ ట్వీట్ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

ఆ లేఖ శాంతం...మోదీని ఇంద్రుడు - చంద్రుడు అంటూ ప‌వ‌న్ ప్ర‌శంసించారు. దేశంలోని మోదీది గొప్ప హృద‌యం అని...జాలిగుండె అని ప‌వ‌న్ పొగిడారు. తిత్లీ, ఉద్దానం వ్య‌వ‌హారాల్లో ఏపీకి ఆప‌న్న హ‌స్తం అందించగ‌లిగే స‌త్తా ఒక్క మోదీకి మాత్ర‌మే ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ నొక్కి మ‌రీ చెప్పారు. ఆ బాధితుల‌కు స‌త్వ‌ర ఆర్థిక సాయం అందించాల‌ని మోదీకి ప‌వ‌న్ విన్న‌వించుకున్నారు. అయితే, ఇప్ప‌టికే తిత్లీ బాధితుల‌కు సాయం ప్ర‌క‌టించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం కోరినా...కేంద్రం స్పందించ‌లేదు. అదీగాక‌ - కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ....తిత్లీ స‌హాయ‌క చ‌ర్య‌లు జ‌రుగుతున్న‌పుడు ఏపీలో ప‌ర్య‌టించారు. కానీ, ఆ స‌మ‌యంలో కేంద్రం నుంచి ఏపీకి ఎటువంటి సాయం ప్ర‌క‌ట‌న రాలేదు. ఇక‌, రాజ్ నాథ్ ను ప‌వ‌న్ క‌లిసే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు.

ఆ లేఖ‌లో ప‌వ‌న్ వినమ్ర ధోర‌ణిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మోదీ విధేయుడిలా ప‌వ‌న్ వ్య‌వ‌హరిస్తూ ఆ లేఖ రాశార‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. గ‌తంలో హోదా విష‌యంలో కేంద్రం పై విరుచుకుప‌డ్డ ప‌వ‌న్...ఇపుడు మాత్రం ఎందుకు ఇంత విన‌య‌విధేయ‌త‌లు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య ఉన్న చీక‌టి ఒప్పందానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. తిత్లీ..ఉద్దానం...లు గుర్తు పెట్టుకున్న ప‌వ‌న్....హోదా విష‌యం ఎందుకు మ‌ర‌చిపోయారని ప్ర‌శ్నిస్తున్నారు. ప‌వ‌న్ కు చిత్తశుద్ధి ఉంటే...హోదా కోసం ఢిల్లీలో ఎందుకు ఆందోళ‌న చేయ‌లేద‌ని ప్రశ్నిస్తున్నారు. మ‌రి, ఈ లేఖపై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు ప‌వ‌న్ ఏ విధంగా స్పందిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 
Tags:    

Similar News