జ‌న‌సేనాని జిల్లాల ప‌ర్య‌ట‌నకు ప్ర‌త్యేక బ‌స్సు!

Update: 2018-05-08 08:04 GMT
జ‌న‌సేన పార్టీ స్థాపించి నాలుగేళ్లు గ‌డుస్తున్నా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌లేదు. అడ‌పాద‌డ‌పా....కొన్ని జిల్లాల్లో నాలుగైదు రోజులు ప‌ర్య‌టించిన ప‌వ‌న్...ఆయా సంద‌ర్భాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. అజ్ఞాత‌వాసి విడుద‌లైన త‌ర్వాత పూర్తిస్థాయిలో రాజ‌కీయాల‌పై దృష్టి సారించిన ప‌వ‌న్....క‌రీం నగ‌ర్ , అనంత‌పురంల‌లో ప‌ర్య‌టించారు. ఆ త‌ర్వాత జిల్లాల వారీగా ఏపీ మొత్తం ప‌ర్య‌టిస్తాన‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అందులో భాగంగానే ప‌వ‌న్....జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. అందుకోసం ప్ర‌త్యేకంగా ఓ బ‌స్సును ఏర్పాటు చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని స‌క‌ల స‌దుపాయాలు, సౌక‌ర్యాలు ఉండేలా ఆ బ‌స్సును హైద‌రాబాద్ కు చెందిన ఓ ప్ర‌ముఖ ఆటోమొబైల్ కంపెనీ రీమోడ‌ల్ చేస్తోంద‌ని తెలుస్తోంది.

వైసీపీ అధినేత జ‌గ‌న్ కొద్ది నెల‌లుగా ఏపీలో ప్ర‌జాసంక‌ల్ప యాత్ర నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అదే త‌ర‌హాలో త్వ‌ర‌లోనే ఏపీలోని 10 జిల్లాల్లో 40 రోజుల పాటు ప‌ర్య‌టించేందుకు ప‌వ‌న్ సిద్ధ‌మ‌వుతున్నారు. అందుకోసం స్పెష‌ల్ బ‌స్సును సిద్ధం చేయిస్తున్నారు. రెస్ట్ రూమ్, చిన్న సైజు మీటింగ్ క్యాబిన్, ల్యాప్ టాప్ లు, లోప‌ల నుంచి బ‌స్సు టాప్ పైకి చేరుకునేలాగా నిచ్చెన ఉండే విధంగా ప్రత్యేక బ‌స్సును రీమోడ‌ల్ చేయిస్తున్నార‌ట‌. స‌క‌ల సౌక‌ర్యాల‌తో ఉండేలా ఆ బ‌స్సు రీమోడ‌ల్ చేసే బాధ్య‌త‌ను హైద‌రాబాద్ కు చెందిన ఓ సంస్థ చేప‌ట్టింద‌ట‌. కొద్దిరోజులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ ల‌ను ప‌వ‌న్ టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర‌లో కూడా టీడీపీ నేత‌ల అవినీతిని దుయ్య‌బ‌ట్ట‌డ‌మే ఎజెండాగా ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం తెలంగాణ‌లో మావోయిస్టుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య భారీ ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అది బూట‌క‌పు ఎన్ కౌంట‌ర్ అని, దానికి ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని మావోయిస్టులు బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. దీంతో, తెలంగాణ పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేయాల‌ని వారు నిర్ణ‌యించారు. అందులో భాగంగానే కేసీఆర్ కు అత్యంత ప‌టిష్ట‌మైన‌, అత్యాధునిక‌ వ‌స‌తుల‌తో కూడిన బ‌స్సును రూపొందించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ పర్యటనల కోసం వినియోగిస్తున్న బస్సుకు అద‌నంగా ఈ బస్సును కొనుగోలు చేయాలని రాష్ట్ర హోంశాఖ నిర్ణయించింది.

కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కు రెండు ప్ర‌త్యేక బ‌స్సులున్నాయి. రూ. 4 కోట్ల విలువచేసే బ‌స్సును రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌ల నిమిత్తం వాడుతున్నారు. 2017లో తెలంగాణ‌లో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ నేప‌థ్యంలో కేసీఆర్ కు మ‌రింత ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను క‌ల్పించేందుకు హోం శాఖ చ‌ర్య‌లు చేప‌ట్టింది.  అందులో భాగంగానే మెరుగైన  బుల్లెట్ ప్రూఫ్ స‌దుపాయాలున్న అత్యాధునిక బస్సును రూ.7 కోట్లు పెట్టి కొనుగోలు చేయ‌నుంది. మావోయిస్టు ప్రాబ‌ల్యం అధికంగా ఉన్న‌ జిల్లాలలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న నిమిత్తం వినియోగించాల‌ని భావిస్తోంది. అదే విధంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు రూ.5 కోట్ల విలువున్న అత్యాధునిక బ‌స్సును త‌న ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా ఉప‌యోగిస్తున్నారు. ల్యాండ్ మైన్, బుల్లెట్ ప్రూఫ్ తో పాటు అధునాత‌న స‌దుపాయాలున్న ఆ బ‌స్సును చంద్ర‌బాబు వినియోగిస్తున్నారు. తాజాగా ప‌వ‌న్ రీమోడ‌ల్ చేయిస్తున్న బ‌స్సు ధ‌ర కూడా దాదాపుగా రూ.4 కోట్లు ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా.
Tags:    

Similar News