పవన్ ఎఫెక్టు ఇంత ఎక్కువ? వైఎస్ విగ్రహాన్నే కదిలించేరుగా?

Update: 2022-11-08 05:56 GMT
న్యాయం మాత్రమే మాట్లాడాలి. నిజం మాత్రమే చెప్పాలి. ప్రజల కోసం ఆలోచించాలి. వారికి కష్టాలు తీరేందుకు ప్రయత్నించాలి. వారికి అవసరమైన సాయం అందించాలి.వారికి అండగా నిలవాలి. సామాన్యుల బతుకుల్లో మార్పు తేవాలి. అందుకోసం తపించాలి. అందుకు తగ్గట్లు ఆలోచించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివన్నీ చేసే రాజకీయ అధినేత ఎవరైనా ఉన్నారంటే.. అది ఒక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రమే. ఆయన్ను మిగిలిన రాజకీయ నేతలతో పోల్చటం. ఆయన రూటు కాస్తంత సపరేట్ గా ఉంటుంది.

అదేందండి.. పవన్ స్టైల్ అలా ఉంటుంది? ప్రజాజీవితంలో ఉండాలనుకునే వారు.. సినిమాల్లో మాదిరి అలా బట్టలు వేసుకుంటారా? ఆ నడక ఎందుకు అలా ఉంటుంది? ఆయన హావబావాల్లో సెటిల్డ్ గా ఎందుకు ఉండవు? అంటూ బొక్కలు వెతికే వారు కేజీల కొద్దీ కనిపిస్తుంటారు. అందుకే అతని మీద ఎంతటి దుష్ప్రచారం చేసినా కూడా ఆయన ఇమేజ్ అస్సలు అంటే అస్సలు ప్రభావితం కాలేదని చెప్పాలి.

నిజానికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడన్నప్పుడు.. సాధారణంగా అలాంటి అధినేత మీదా.. సెలబ్రిటీ మీద మహిళల్లో వ్యతిరేకత ఉంటుంది. కానీ.. పవన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఆయన సినిమా విడుదలైన మొదటి రోజున.. సాధారణ థియేటర్ మొదలు కొని మల్టీఫ్లెక్సుల్లోనూ మహిళలు పోటెత్తటమేకాదు.. సకుటుంబ సమేతంగా రావటం.. చంటి పిల్లల తల్లులు సైతం సినిమాకు వచ్చే పరిస్థితి చూస్తే.. ఆయన ఇమేజ్ ఏమిటో అర్థమవుతుంది. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కొనే దమ్ము లేక చేసే పస లేని వాదనల్లో ఇదొకటిగా చెప్పాలి.

పవన్ ఎంత పవర్ ఫుల్ అంటే.. ఎవరు చెప్పినా వినని వైసీపీ ప్రభుత్వం సైతం పవన్ ధర్మాన్ని పాటించాల్సిన పరిస్థితి. కనీసం ఆర్టీసీ బస్సు కూడా రాని ఇప్పటం గ్రామంలోని రోడ్లను 120అడుగుల మేర విస్తరించే అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసి.. సామాన్యుల నివాసాల మీద విరుచుకుపడిన సర్కారుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తాయి. తమ పార్టీ ప్లీనరీకి భూములుఇచ్చిన వారికి తగిన శాస్తి చేసేందుకే ఇలా చేశారంటూ మండిపడుతున్న పవన్.. ఇప్పటం గ్రామాన్ని సందర్శించటమే కాదు.. ఆయన చెప్పిన ధర్మం షాకింగ్ గా మారింది.

గాంధీ.. నెహ్రూ.. అబ్దుల్ కలాం విగ్రహాలతో పాటు.. శివుడి గుడి ముందు ఉన్న నంది విగ్రహాన్ని తొలగించిన అధికారులకు వాటి మధ్యలోనే ఉన్న దివంగత వైఎస్ విగ్రహాన్ని ఎందుకు కదల్చలేదు? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి ధర్మం? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు ఏపీ వ్యాప్తంగా అందరి నోట రావటమే కాదు.. అధికారులు ఇరుకున పడ్డారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.

అందుకే.. పవన్ పర్యటన పూర్తైన రెండు రోజులకే ప్రభుత్వానికి వైఎస్ విగ్రహాన్ని కదల్చటం మినహా మరో మార్గం లేకపోయింది. దీన్ని చూసిన వారంతా.. జగన్ ప్రభుత్వాన్ని కదిలించిన వ్యక్తిగా పవన్ ను అభివర్ణిస్తున్నారు. న్యాయం చెప్పటమే కాదు.. ప్రభుత్వం ఆ న్యాయాన్ని పాటించేలా చేసిన పవన్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటం ఎపిసోడ్ ను చూసినోళ్ల  పలువురు..  ఇరికించాలనుకున్న వారే ఇరుక్కుపోయారే.. అన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News