ప‌వ‌న్‌..ఇప్పుడే ప్ర‌శ్నించ‌డ‌ట‌

Update: 2015-08-29 06:50 GMT
కేంద్ర మంత్రి ఇంద్ర‌జీత్ సింగ్ ప్ర‌త్యేక హోదా ఏ రాష్ర్టానికి ఇచ్చేది లేద‌ని ప్ర‌క‌టించ‌డం, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ త‌న‌ను క‌లిసిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో స్పెష‌ల్ స్టేట‌స్ ఇచ్చేది లేనిది తేల్చ‌క‌పోవ‌డం.... ఏపీకి భారీ ప్యాకేజీపై ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ పొడిపొడి స్పంద‌న నేప‌థ్యంలో అంద‌రిక‌ళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పై ప‌డ్డాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి స్పందించాల‌ని ప‌లువురు కోరుకోగా.. జనసేన అధినేత నోరెందుకు విప్ప‌డం లేదంటూ రాజ‌కీయ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేశారు. అయితే ప‌వ‌న్ త‌న భావాన్ని వెల్ల‌డించారు.

ఏపీకి ప్రత్యేక హోదాపై నటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో మరోసారి స్పందించారు. స్పెషల్ స్టేటస్ పై భావోద్వేగాలకు పోకుండా ఇంకొంత కాలం వేచి చూద్దామని ఏపీ ప్రజలకు పవన్ సూచించారు. అప్పటికీ న్యాయం జరగని పక్షంలో హోదా ఎలా సాధించాలో ఆలోచిద్దామన్నారాయన. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని, ప్రజలకు తగిలిన గాయాలను ప్రధాని మోడీకి తాను గతంలోనే వివరించానని, ఆయన అర్థం చేసుకున్నారని పవన్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే తాను భావిస్తున్నట్టు పవన్ చెప్పారు. అయితే హోదా విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, కానీ దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని మరికొంతకాలం వేచి చూద్దామని పవన్ విజ్ఞప్తి చేశారు.

ఆవేశ‌ప‌డ‌కుండా ఉండేందుకు, కేంద్రానికి కొంత స‌మ‌యం ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌ని ప‌వ‌న్ వేగిరంగా ఇచ్చిన స‌మ‌యాన్ని పాల‌కులు, ప్ర‌తిప‌క్షాలు ఏ విధంగా అర్థం చేసుకుంటాయో చూడాలి మ‌రి.
Tags:    

Similar News