మౌన‌మే ప‌వ‌న్ అంగీకార‌మా?

Update: 2019-01-02 12:59 GMT
ఒక‌వైపు ప‌వ‌న్ క‌ళ్యాన్ చంద్ర‌బాబును తిట్ట‌డం మానేశాడు
మ‌రోవైపు వైఎస్ జ‌గ‌న్‌ పై విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లుపెట్టాడు...
ఇంత‌లో ... చంద్ర‌బాబు ప‌వ‌న్ మాతో క‌లిస్తే త‌ప్పేంటి అన్నాడు...

ఊహాజ‌నిత ప్ర‌శ్న‌ల‌పై మాట్లాడ‌ను అని అంటూనే మాతో క‌లిస్తే త‌ప్పేంటి? అని చంద్ర‌బాబు అన‌డం రాష్ట్రంలో ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది. అంత‌టితో ఆగ‌కుండా మోడీ పై పోరాడ‌దాం రా అన్నాడు. కొంత‌కాలం క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా మ‌మ్మ‌ల్ని అడిగితే మేము మ‌ద్ద‌తు ఇస్తాం క‌దా అన్నారు. తాజాగా చంద్ర‌బాబు దానికి కొన‌సాగింపు ఇచ్చారు. ఇదంతా నిన్న‌టి క‌థ‌... చంద్ర‌బాబు నేరుగా ప‌వ‌న్ స‌ఖ్య‌త గురించి మాట్లాడినా ఇంత‌వ‌ర‌కు అదే విజ‌య‌వాడ‌లో ఉన్న ప‌వ‌న్ నోటి నుంచి ఒక్క ఖండ‌న రాక‌పోవ‌డం చూస్తుంటే... టీడీపీతో ప‌వ‌న్ పొత్తు ఉన్న‌ట్టే అని చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. ఒక వేళ ప‌వ‌న్ తీవ్రంగా వ్య‌తిరేకించే ప‌రిస్థితే ఉంటే... క‌చ్చితంగా ఈపాటికి స్పందించేవారు అంటున్నారు. ప‌వ‌న్ ఒక్క‌టే కాదు - పార్టీ నుంచి గాని - పార్టీ నేత‌ల నుంచి ఒక్క ఖండ‌న రాలేదంటే... ఆల్రెడీ ఆ ఇరుపార్టీల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డమే దీనికి కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు.

లేక‌పోతే పొత్తుకు ప్ర‌జ‌ల్లో స్పంద‌న ఎలా ఉంటుందో అని ఇద్ద‌రూ ఒక ఒప్పందం మేర‌కు స్పందించ‌డం... కౌంట‌ర్ ప్ర‌జ‌ల స్పంద‌న‌ను బ‌ట్టి నిర్ణ‌యించాల‌ని కూడా ఒక అంత‌ర్గ‌త ఒప్పందం జ‌రిగి ఉండొచ్చు. ప‌వ‌న్ టీడీపీ నేత‌ల‌పై చాలా పెద్ద కామెంట్లే చేశారు గాని చంద్ర‌బాబును ఎలా ప‌డితే అలా ఎన్న‌డూ తిట్ట‌లేదు. మ‌రోవైపు జ‌గ‌న్‌ ను మాత్రం హ‌ద్దులు దాటి తిట్టాడు. ఇదంతా చూస్తుంటే... ప‌వ‌న్ అమెరికా టూర్లో ఏం జ‌రిగింద‌బ్బా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.

పైగా ఇంట‌ర్నెట్లో చాలా ఫాస్ట్‌ గా ఉండే జ‌న‌సేన దీనిపై ఎంత చ‌ర్చ జ‌రుగుతుందో గ‌మ‌నిస్తూనే ఉండిఉంటుంది. అయినా పార్టీ నుంచి స్పంద‌న లేక‌పోవ‌డం క‌చ్చితంగా వీరి మ‌ధ్య భ‌విష్య‌త్తు పొత్తుకు సూచిక అనే అంటున్నారు. మ‌రి వీరి వ్య‌వ‌హారం రేప‌టిలోపు తేలాలి. లేదంటే పొత్తు గ్యారంటీ అని జ‌నం ఫిక్స‌య్యే ప‌రిస్థితి ఉంది. ప‌వ‌న్ మౌనం వ‌ల్ల జ‌న‌సైనికులు నోటికి తాళం వేసిన‌ట్ట‌య్యింది.


Full View


Tags:    

Similar News