జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. రాజకీయ అధినేతల్ని టార్గెట్ చేసే ధైర్యం ఎవరూ చేయరు. సినిమాల్లో మాదిరి ఎవరైనా నేతపై భౌతికదాడి కోసం వందమంది గ్రూపుగా వచ్చి.. దాడి చేయాలని ప్లాన్ చేయరు. మరి పవన్ వద్ద ఎలాంటి సమాచారం ఉందో కానీ.. తనపై దాడి చేసేందుకు వంద మంది వచ్చారని.. ఆ విషయం తనకు తెలుసన్నారు.
తెలంగాణలో సభ పెడితే తనను కొట్టేందుకు వంద మంది వరకూ జనంలో దూరిపోయారని చెబుతూ.. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఎలాంటి వ్యాఖ్యానం లేకుండా.. పవన్ అన్న మాటల్ని అన్నట్లు చూస్తే.. ఆశ్చర్యానికి గురి కావటం ఖాయం.
రీల్ లో మాదిరి రియల్ గా కూడా పవన్ లాంటి ఒక ప్రముఖుడిపై దాడి చేసేందుకు వంద మంది వస్తారా? అన్నది ఒక ప్రశ్న అయితే.. వంద మంది వచ్చిన విషయం పవన్ కు తెలిసినప్పుడు.. ఆ పంపిందెవరో కూడా పవన్ కు తెలిసి ఉండాలి. మరి.. పవన్ మీద దాడికి ప్లాన్ చేసిందెవరు? ఎవరు వంద మందిని ఆయనపై పంపారన్న విషయాన్ని పవనే స్వయంగా చెబితే బాగుంటుందేమో.
ఇంతకూ పవన్ చెప్పిన మాటల్ని ఆయన మాటల్లోనే చూస్తే.. "తెలంగాణలో నన్ను కొట్టడానికి 100 మంది వచ్చారు. దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులు ఎవరెవరో చేసిన తప్పులకు తెలంగాణ నాయకులు మనందరినీ అడ్డగోలుగా తిడుతుంటే.. హైదరాబాద్‌లో ఉన్న మన ఎమ్మెల్యేలకు మాట్లాడ్డానికి ఒక్కడికి ధైర్యం లేదు. ఆ రోజున నేను తెలంగాణలో సభ పెడితే నన్ను కొట్టడానికి దాదాపు ఒక 100 మంది జనంలో దూరిపోయారు" అని చెప్పారు.
"నేను ఎలాంటోణ్నంటే.. మీరు కొడితే నేను కూర్చోబెట్టి, చేతులు ముడుచుకొని ‘అయ్యా.. బాబూ’ అనే వ్యక్తిని కాదమ్మా గుర్తుపెట్టుకోండి. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పెరిగినవాళ్లం.. మీరు కొడతా ఉంటే చేతులు కట్టుకుని ‘కొట్టండి కొట్టండి’ అంటామా ఏంటి? ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాం. అధర్మాన్ని ఎదిరించడానికి వచ్చాం. సత్యం మాట్లాడతాం. తప్పుంటే సరిదిద్దుకుంటాం. తప్పు చేస్తే తోలు తీస్తాం. మాట్లాడతాం" అని వ్యాఖ్యానించారు.
"ప్రజాస్వామ్యంలో మా గొంతులు నొక్కే హక్కు ఎవ్వరికీ లేదు. అది తెలంగాణలో కాదు.. హైదరాబాద్ లో కాదు.. వరంగల్ నడిబొడ్డులో కాదు.. ఎక్కడైనా సరే! ఇది భారతదేశం.. నేను భారతీయుణ్ని. నేను ఎక్కడైనా మాట్లాడటానికి ప్రజాస్వామ్యం నాకు హక్కు ఇచ్చింది. నేను నా హక్కుల గురించి మాట్లాడేటప్పుడు నన్ను ఎన్ని లక్షల మంది బెదిరించినా నన్ను ఆపలేరు. ఆ రోజు నన్ను కొట్టడానికి వచ్చినవాళ్లు కూడా చప్పట్లు కొట్టి వెళ్లిపోయారు.’’ అని పవన్ వెల్లడించారు.