అందరూ సీఎం అవ్వాలనుకునే వాళ్లే: పవన్‌

Update: 2019-01-11 04:27 GMT
ఎన్నికలు దగ్గరపడడంతో.. స్పీడ్‌ పెంచాడు జనసేనాని. ఈ సందర్బంగా విజయవాడలోని జనసేన పార్టీ ఆఫీస్‌ లో కడప జిల్లా నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు పవన్‌. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావాలని టీడీపీ శ్రేణులు, జగన్‌ సీఎం కావాలని వైసీవీ వర్గాలు కోరుకుంటున్నాయని.. కానీ రాష్ట్రం, ప్రజలు బాగుపడాలని ఎవ్వరూ కోరుకోవడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం ప్రతీ జనసైనికుడు కష్టపడాలని పిలుపునిచ్చారు.
     
మెగాస్టార్‌ చిరంజీవి ప్రజలకు సేవ చేయాలనే తలంపుతోనే ప్రజారాజ్యం పార్టీ పెట్టారని చెప్పాడు పవన్‌. అయితే పక్కనున్న వాళ్ల వల్లే ప్రజారాజ్యం పార్టీ పతనమైపోయిందని అన్నాడు. గతంలో కుక్కని నించోపెట్టినా గెలుస్తుందని ఎన్టీఆర్‌ అన్నారని.. అదే ఎన్నికల్లో ఆయనే ఓడిపోయారని గుర్తు చేశారు. విజయ గర్వం తలకు ఎక్కించుకుంటే ఇలాగే ఉంటుందని.. అందుకే తాను అలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పారు. జిల్లాలో కొంతమంది జనసేన నాయకులు ఎంపీ, ఎమ్మెల్యే పొందినట్లుగా భావించి ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారని... అలాంటి వారందర్ని ఇదే వేదిక పైనుంచి హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు కానీ జనసైనికులు మాత్రం ఎప్పుడూ పార్టీతోనే ఉంటారని..వారే తన బలం అని చెప్పారు పవన్‌.


Full View


Tags:    

Similar News