అన్నా త‌మ్ముళ్ళ‌ బంధం బ‌ద్ద‌లైనట్లేనా...!

Update: 2019-10-14 14:30 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి తో కేంద్ర మాజీ మంత్రి - మెగాస్టార్ చిరంజీవి భేటీపై త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గుస్సా అవుతున్నాడ‌ట‌. సీఎం జ‌గ‌న్ - మెగాస్టార్ చిరంజీవి ఈరోజు విందు రాజ‌కీయం నెరుపుతున్నారు. ఇది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కు సుతారం ఇష్టం లేద‌ట‌. అందుకే అన్న‌య్య‌పై త‌మ్ముడు కోపంగా ఉన్నాడ‌ని ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్పుడు జ‌గ‌న్ చిరు ఇద్ద‌రి భేటీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి అంతు చిక్క‌కుండా ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గ‌త కొంత కాలంగా జ‌గ‌న్‌తో క‌లిసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. సైరా సినిమా షూటింగ్‌ లో ఉన్నందు వ‌ల్ల ఆయ‌న సీఎం జ‌గ‌న్‌ ను క‌లువ‌లేదట‌. ఇప్పుడు సైరా చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతుంది.

అయితే సీఎం జ‌గ‌న్‌ ను మెగాస్టార్ చిరంజీవి క‌ల‌వ‌డం కేవ‌లం సైరా చిత్రం కోస‌మే అని బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మాత్రం త‌న రాజ‌కీయ శ‌త్రువుతో త‌న అన్న క‌ల‌వ‌డం ఏమిట‌నే అంత‌ర్మ‌ధ‌నంలో ఉన్నాడ‌ట‌. ఏపీలో జ‌న‌సేన కు మెగాస్టార్ బూస్టింగ్ ఇస్తాడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌త కొంత కాలంగా అనుకుంటున్నాడట‌. అందుకే అన్న కుటుంబానికి ద‌గ్గ‌ర అవుతున్నాడ‌ని ప్ర‌చారం కూడా ఉంది. అందుకే ప్ర‌తి ఫంక్ష‌న్ - సినిమా ప్ర‌మోష‌న్ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళుతున్నాడు. ఇటీవ‌ల సైరా సినిమాకు కూడా త‌న వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు. అయితే రోజు రోజుకు అన్న‌ద‌మ్ముల అనుబంధం బ‌ల‌ప‌డుతున్న త‌రుణంలో సీఎం జ‌గ‌న్‌ తో చిరు భేటీ కావ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డ్డ‌ట్లు అయింద‌ట‌.

ఇంత కాలం సీఎం జ‌గ‌న్ చేస్తున్న ప‌రిపాల‌న‌లోని లోపాల‌ను ఎత్తి చూపుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సొంత అన్నే ఆయ‌న‌తో భేటి కావ‌డంతో ప‌వ‌న్  త‌ల‌తీసేసినంత ప‌నైంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అన్న‌ద‌మ్ములు ఒకే చూరుకింద‌కు చేరుకునే స‌మ‌యంలో ఈ భేటితో ఇద్ద‌రు చెరోదారి చూసుకోనున్నారనే ప్రచారం జ‌రుగుతుంది. ఇక ముందు మెగాస్టార్ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ఖ్య‌త‌గా ఉండ‌కుండా ప‌గోడిగానే చూసే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని రాజ‌కీయ స‌ర్కిల్‌లో జోరుగా వినిపిస్తుంది. అంతే కాదు.. ఇక ముందు అన్న‌ద‌మ్ముల అనుబంధంకు బీట‌లు వారిన‌ట్లేన‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం త‌న‌ను రాజ‌కీయంగా బ‌లి చేస్తున్నాడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేద‌న చెందుతున్నాడ‌ట‌. కేవ‌లం త‌న అన్న రాజ‌కీయ స్వార్థంతోనే ఆలోచిస్తున్నాడ‌ని, అందుకే జ‌గ‌న్‌తో క‌లిసి త‌న‌ను మోసం చేస్తున్నాడ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమిలికుమిలి పోతున్నాడ‌ట‌. ఏద‌మైనా ఇప్పుడు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్‌తో త‌న అన్న మెగాస్టార్ చిరంజీవి భేటి కావ‌డం ప‌వ‌న్ క‌ళ్యాణ్ జీర్ణించుకోలేక పోతున్నాడ‌ని టాక్‌. ఇప్పుడు ఇద్ద‌రి భేటితో తాను ఏ మోహం పెట్టుకుని ఏపీలో రాజకీయం చేయాలనే అస‌హానంతో ప‌వ‌న్‌ ఊగిపోతున్న‌ట్టు కూడా తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్ మెగాస్టార్ భేటితో ప‌వ‌న్ కళ్యాణ్ రాజ‌కీయ జీవితం ప‌రిస‌మాప్తే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్న హాట్ టాపిక్‌.. సో అన్నయ్య  భేటిపై మ‌రి ప‌వ‌న్ ఎలా స్పందిస్తాడో ?  చూడాలి.




Tags:    

Similar News