బాబు బ్యాడ్‌ టైంలో ఊహించ‌ని దెబ్బ‌కొట్టిన ప‌వ‌న్‌

Update: 2020-01-15 16:37 GMT
ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌ - టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఊహించ‌ని షాక్ ఇచ్చార‌ని అంటున్నారు. ఏపీ సీఎం జగన్ ‘మూడు రాజధానుల ప్రతిపాదన’ అనంతరం రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా చంద్ర‌బాబు దూకుడుగా ముందుకు వెళుతున్న సంగ‌తి తెలిసిందే. రాజధాని మార్పు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అశాంతిని తొలగించడానికి క‌లిసి రావాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఆయ‌న కోరారు. అయితే, పవ‌న్ త‌న సొంత పార్టీ ఎజెండాతో ముందుకు సాగారు. ఈ షాక్ నుంచి తేరుకుంటుండ‌గానే... ప‌వ‌న్ బీజేపీ ముఖ్య నేతలతో సోమవారం భేటీ అయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డాను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. తాజాగా గురువారం ఈ ఇరు పార్టీల నేత‌ల స‌మావేశం - విలేక‌రుల స‌మావేశం కూడా నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అమరావతిలో రైతుల‌కు మ‌ద్ద‌తుగా ప‌వ‌న్ క‌లిసి వ‌స్తాడ‌ని బాబు ఆశిస్తే...ప‌వ‌న్ మాత్రం మొద‌టి నుంచి ప్ర‌త్యేక అజెండాతో ముందుకు సాగారు. గ‌త‌ శుక్రవారం వారితో సమావేశమైన పవన్ .. రాజధానికి సంబంధించిన అనిశ్చితిని కేంద్రమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. శాసనసభలో రాజధానిపై తీర్మానం చేయడం కన్నా ముందే.. కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో చర్చించేందుకు పవన్‌ ఢిల్లీ వెళ్లార‌ని ప్ర‌చారం జ‌రిగింది. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్ జేపీ నడ్డాతోపాటు హోంమంత్రి అమిత్‌షాలను కలుస్తారంటూ ప్రచారం జరిగిన‌ప్ప‌టికీ...పవన్‌కు అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. అయిన‌ప్ప‌టికీ...మ‌రో రోజు వేచి చూసి న‌డ్డాను క‌లిశారు. బీజేపీతో జ‌న‌సేన పొత్తుకు గ్రీన్ సిగ్న‌ల్ పొందారు.

విజయవాడలో ఓ హోట‌ల్‌ లో గురువారం జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుల చర్చలు జ‌రిపి అనంతరం మధ్యాహ్నం 3గం.కు ఇరుపార్టీల నేతలు కలసి విలేకర్ల సమావేశం నిర్వహిస్తారు. అంటే పొత్తు ప్ర‌క‌ట‌నే. దీంతో ప‌వ‌న్ మ‌ద్ద‌తుపై గంపెడాశ‌లు పెట్టుకున్న చంద్ర‌బాబు...ఇప్పుడు ఆయ‌న బీజేపీతో క‌లిసిపోవ‌డంతో ఒకింత డైల‌మాలో ప‌డిపోయిన ప‌రిస్థితి.


Tags:    

Similar News