జనసేన అధినేత - ప్రస్తుతం జెఎఫ్ సి అధ్యయనాల ద్వారా నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పవన్ కల్యాణ్.. మార్చి 14 వ తేదీన గుంటూరులో భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా అధ్యయనం చేస్తున్న కమిటీ వారు చెబుతున్న దాన్ని బట్టి మహా అయితే మరో వారం రోజుల్లోగానే వారు తమ పరిశీలన ఫలితాలను వెల్లడించేస్తారు. అంటే లోపం ఎక్కడ జరుగుతున్నదో చెప్పే ప్రయత్నం చేస్తారు. దానికి వ్యతిరేకంగా ఏం జరిగితే బాగుంటుంది అనే ఆలోచన రెండో దశ! అయితే కమిటీ తేల్చిన నిజాల ఆధారంగా జనసేన పార్టీ తన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటుందేమో అని ప్రస్తుతం ఈ వార్తలను చూస్తోంటే అనిపిస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆరోజున ఈసారి నిర్దిష్టమైన కార్యాచరణతో జరుపుకోవాలని, అందుకే భారీ బహిరంగ సభ పెట్టాలని పవన్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికల బరిలోకి దిగాలని అనుకుంటున్న ఏ పార్టీ అయినా పదినెలల ముందు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఈ స్థాయిలోనే జరుపుకోవాలని కలగనడంలో ఆశ్చర్యం ఏమాత్రమూ లేదు.
కాకపోతే.. పవన్ కల్యాణ్ నిర్వహించదలచుకుంటున్న గుంటూరు భారీ బహిరంగసభకు - ప్లీనరీ తరహా పార్టీ కార్యక్రమానికి నిర్దిష్టమైన ఎజెండా ఉందా? సాధారణంగా ప్రజాసంక్షేమానికి ఇచ్చే హామీలు - రాష్ట్రంలోని సమస్యలను ఏకరవు పెట్టేసి.. వారందరి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తాను అండగా - వారికి దన్నుగా ఉంటానని చెప్పే పడికట్టు డైలాగులు కాకుండా.. పవన్ కల్యాణ్ నిర్దిష్టంగా ఏదైనా విషయాలను ప్రకటించబోతున్నారా? అనేది ఇప్పడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.
పవన్ కల్యాణ్ ప్రస్తుత నిజనిర్ధారణ కమిటీ రూంలో ఎన్ని నివేదికలు తయారుచేసినా.. దానివల్ల వాస్తవమైన ప్రయోజనం ఉంటుందనుకోవడం భ్రమ. ఎందుకంటే.. ప్రజలకు తెలియని, వారి ఊహల్లో లేని కొత్త సంగతులు ఈ అధ్యయనం వల్ల బయటకు వస్తాయని ఎవ్వరూ భావించడం లేదు. పైగా నిజాలు తెలుసుకోవడం వల్ల లాభమేంటి. పోరుపథం తొక్కితే తప్ప.. ఫలితం వచ్చే చాన్సు లేదు. అలాంటప్పుడు కనీసం పార్టీ ప్లీనరీ సమయానికైనా తమ పార్టీ రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఏ రకంగా పోరాటానికి సిద్ధమవుతున్నదో వెల్లడిస్తే తప్ప.. పవన్ జనంలో క్రెడిబిలిటీ పెంచుకోవడం కష్టం అని పలువురు అంటున్నారు.