ఏపీ ముఖ్యమంత్రి - వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రంగా రాష్ట్రంలో కుల - మత విమర్శల పరంపర కొనసాగుతోంది. ఓ వైపు విపక్షాల ఆరోపణలు...మరోవైపు వైసీపీ వివరణలు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. జగన్ మతం ఏంటని విపక్షాలు ప్రశ్నించిన నేపథ్యంలో...తన మతం మానవత్వం…కులం మాట నిలబెట్టుకునే కులం అని సీఎం జగన్ వెల్లడించారు. అయితే - జగన్ క్లారిటీ పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్లీ ఘాటు కామెంట్లు చేశారు. మతం మార్చుకున్న జగన్.. కులాన్ని ఎందుకు వదలటం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
వైసీపీ మేనిఫెస్టోను భగవద్గీత - బైబిల్ - ఖురాన్ గా భావిస్తూ... ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతోనే ఆర్నెల్లు పనిచేశానని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. గుంటూరు మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభిస్తూ - రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని.. అందుకే తన మతం - కులంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇది తనకు చాలా బాధ కలిగిస్తోందన్న జగన్…తన మతం మానవత్వం…కులం మాట నిలబెట్టుకునే కులమని స్పష్టం చేశారు.
కాగా, సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మళ్లీ స్పందించారు. మతం మార్చుకున్న జగన్ తన కులాన్ని ఎందుకు వదలటం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం..జగన్ రెడ్డి గారూ.. మతం మారాక కులాన్ని వదిలేయండని పవన్ సూచించారు. కులం కావాలి - మతం కావాలి - ఓట్లు కావాలి - డబ్బులు కావాలని జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కులం - మతం - ఓట్లు - డబ్బులు కావాలి అంటే కుదరదన్నారు. వైసీపీది రంగుల రాజ్యం అని పవన్ ఆరోపించారు. వైసీపీ నేతలు ఏడుకొండల వాడికి మాత్రమే రంగులు వేయడం లేదని పవన్ కళ్యాణ్ చురకలు అంటించారుఏ ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం.. ఆ ధర్మానికి ఇచ్చి తీరాలన్నారు. తిరుపతిని గౌరవించాలన్న పవన్.. ఇక్కడ మత ప్రచారం జరపొద్దన్నారు. కడప దర్గాలో జై భవానీ అన్నా.. ఒప్పుకోనని పవన్ పేర్కొన్నారు.