రోజుకో మాట అన్నట్లుగా మారింది జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు. నిన్నటి వరకూ ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాను మద్దతు ఇవ్వకపోవటంపై వ్యాఖ్యలు చేసిన ఆయన..తాజాగా తాను చెప్పిన మాటలకు పూర్తి భిన్నమైన మాటల్నిచెప్పుకొచ్చారు.
తాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతు ఇవ్వటానికి కారణం వారసత్వ రాజకీయాలు అంటే ఇష్టం లేదని అందుకే మద్దతు ఇవ్వలేదన్న ఆయన.. తర్వాత అనుభవం ముచ్చటను చెప్పుకొచ్చారు. అయితే.. ఈ రెండు అంశాల మీద విమర్శలు రావటంతో మూడో రోజు ముచ్చటగా మరో మాటను చెప్పటం షురూ చేశారు.
జగన్ కు తాను మద్దతు ఇచ్చేవాడినని.. కాకుంటే ఆయనపై కేసులు ఉన్నాయని అందుకే ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తన మద్దతు జగన్‌కు ఉండేదని.. కానీ అప్పటికే జగన్ మీద కేసులు ఉన్నాయని.. కోర్టులో కేసులు ఉన్న నేతకు మద్దతు ఇవ్వలేకే తాను జగన్ పక్షాన నిలవలేదన్నారు.
తొలుత వారసత్వం అంటూ చెప్పిన మాటకు విమర్శలు వెల్లువెత్తటం.. అనుభవం లేదన్న కారణంగా మద్దతు ఇవ్వలేదన్న మాటకు పంచ్ ల మీద పంచ్ లు పడటంతో చివరకు కేసుల వ్యవహారాన్ని ప్రస్తావించారని చెబుతున్నారు. చూస్తుంటే.. నిలకడగా నిలబడటం కూడా రాదని విమర్శలు ఎదుర్కొనే పవన్ కు.. చెప్పిన మాట మీద నిలిచే అలవాటు కూడా ఉండదా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి.. రానున్న రోజుల్లో ఇంకెన్ని మాటలు చెబుతారో?