పవన్ చేతికి ఫ్యాక్ట్స్ రిపోర్టు

Update: 2018-03-01 16:47 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రజలు - రాజకీయవర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంయుక్త నిజనిర్ధారణ సంఘ నివేదిక జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతికి అందింది. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలే ఏపీని ముంచాయని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని కమిటీ నివేదికలో పేర్కొంది. రేపు మరోసారి సమావేశమై నివేదికపై జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చర్చించాక నివేదికను బయటపెట్టనున్నట్లు తెలుస్తోంది.
    
కాగా రాష్ట్ర ప్రభుత్వం అడిగిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని..  ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటూ ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకోలేదని జేఎఫ్‌ సీ రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. విభజన చట్టంలో ఉన్న హామీలేంటి.. అందులో ఏవేవి ఏ స్థాయిలో ఉన్నాయన్నది డీటెయిల్డుగా నివేదికలో ఉన్నట్లు సమాచారం.
    
ఈ నివేదిక అనంతరం పవన్ కల్యాణ్ ఎలాంటి అడుగేస్తారు అనేదానిపై ఏపీ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయని భావిస్తున్నారు. నింద కేంద్రంపై వేసి రాష్ట్రంపై సానుభూతి చూపుతూ చంద్రబాబుకు మరోసారి అండగా నిలుస్తారా...లేదంటే కేంద్రంతో పాటు చంద్రబాబునూ ప్రజల ముందు దోషిగా చూపిస్తూ తాను రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి. అయితే... నివేదిక అనంతరం పవన్ ఏం చేసినా కూడా అది రాజకీయంగా తనకు పనికొచ్చేదిగానే ఉంటుంది తప్ప కేంద్రాన్ని కదిలించే స్థాయిలో ఆయన  యాక్షన్ ప్లాను ఉండకపోవచ్చని తెలుస్తోంది.
Tags:    

Similar News