పసలేని ప్రసంగాలు పవన్ ట్వీట్ !

Update: 2018-07-21 06:07 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై - తెలుగుదేశం లోక్‌సభ సభ్యులపై జనసేనాని పవన్ కల్యాణ్ విరుచుకు పడ్డారు. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించిన గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ ప్రసంగంపై మండిపడ్డారు. "ఏమిటీ ఈ ప్రసంగాలు బాబూ" అని  పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా చురకలు వేసారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా అధికార పక్షం - ప్రతిపక్షం చేస్తున్న విమర్శలనే లోక్‌ సభలో అస్త్రాలుగా వాడడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలను వాగ్దానాలను పదే పదే గుర్తు చేసేందుకేనా ఈ ప్రసంగాలు అని ఎద్దేవా చేశారు.

అవిశ్వాస తీర్మానం పై చర్చను ముందుగా విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని మాట్లాడాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.  నిజానికి సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కేశినేని నానియే - దీనిని అనుసరించి ఆయనే చర్చను ప్రారంభిచాల్సి ఉంది, అయితే కేశినేని నానికి హిందీ - ఇంగ్లీషు భాషల పట్ల అంత పట్టు లేదని - అందుకే ఇంగ్లీషులో మంచి ప్రావీణ్యం ఉన్న గల్లా జయదేవ్ ని ఎంపిక చేసారు.  అయితే భాష పరంగా జయదేవుడు శభాష్ అనిపించుకున్నా విషయ పరంగా మాత్రం సున్న మార్కులు తెచ్చుకున్నారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. అవిశ్వాస తీర్మానం పై చర్చకు ఇలా సన్నద్దమవుతారా అని పవన్ కల్యాణ్   ప్రశ్నలు సంధించారు.
Tags:    

Similar News