మున్సిపల్ ఫలితాలపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్

Update: 2021-03-14 12:30 GMT
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. తనదైన శైలిలో ఈ ఫలితాలను విశ్లేషించారు. ఇందులో వైసీపీ గెలుపు వెనుక కారణాలను పవన్ వివరించారు. పవన్ స్పందన దుమారం రేపింది.

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులతోనే ఎక్కువ స్థానాల్లో గెలిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారని పవన్ ఆరోపించడం చర్చనీయాంశమైంది.

రేషన్ కార్డులు, పింఛన్లు, విద్యాపథకాలు ఆపేస్తామని అధికార పార్టీ నేతలు బెదిరించినట్లు పవన్ పేర్కొన్నారు. వైసీపీ ప్రజలకు భరోసా ఇచ్చి ఓట్లు సాధించలేదని పవన్ విమర్శించారు. ప్రజల కడుపు మీద కొట్టి తిండి లాక్కొంటామని బెదిరించడం వల్లే వైసీపీ గెలిచిందని పవన్ సంచలన కామెంట్స్ చేశారు.

ఏపీలో ఇవాళ వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పలుచోట్ల విజయాలు అందుకుంది. ప్రతీ కార్పొరేషన్ , మున్సిపాలిటీలోనూ కనీసం ఒకటి రెండు స్తానాలు సాధించింది. అమలాపురం మున్సిపాలిటీలో అయితే టీడీపీని సైతం వెనక్కి నెట్టి ఆరు స్థానాలు కైవసం చేసుకుంది. పలు చోట్ల టీడీపీ కంటే కూడా మంచి ఫలితాలు సాధించడం ఆ పార్టీ ఉత్సాహంగానే కనిపిస్తోంది.




Tags:    

Similar News