ఏపీ రాజకీయాలు అంతకంతకూ హాట్ హాట్ గా మారుతున్నాయి. ఇప్పటివరకూ ఏ రాజకీయ నాయకుడి టచ్ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపని అంశాన్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా టీడీపీతో తనకున్న దూరాన్ని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి మీదనైనా సరే.. తాను విమర్శలు చేసేందుకు సిద్ధమన్నట్లుగా పవన్ తీరు ఉందన్న అభిప్రాయం కలిగేలా ఆయన వ్యవహరిస్తున్నారు.
సినీ నటుడు కమ్ టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. కొన్నేళ్ల క్రితం బాలయ్య ఇంట్లో కాల్పులు చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించటం ద్వారా కొత్త మాటల యుద్ధానికి తెర తీశారు పవన్ కల్యాణ్.
జనసేన పోరాటయాత్రలో భాగంగా ప్రస్తుతం పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాలు బెణకటంతో భీమవరంలో విశ్రాంతి తీసుకున్నారు. ఇదే సమయంలో అక్కడకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారితో పవన్ ముచ్చటించారు.
పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని యువకులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. బైక్ సైలెన్సర్ తీసి శబ్దం చేస్తే తప్పంటున్నారని పవన్ దృష్టికి తీసుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు బైక్ సైలెన్సర్ తీసి శబ్దం చేస్తే తప్పంటున్నారని.. మరి.. తుపాకీతో కాల్చిన వారిని మాత్రం పట్టించుకోవటం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బాలకృష్ణ ఇంట్లో చోటు చేసుకున్న తుపాకీ కాల్పుల ఉదంతాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించటం గమనార్హం. 2014లో బాలకృష్ణ తన ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేశ్ పై కాల్పులు జరపటం.. ఈ ఉదంతం పెను సంచలనంగా మారటం తెలిసిందే.