ప‌వ‌న్ వార్నింగ్:ఊహించ‌లేని రీతిలో దాడి ఉంటుంది!

Update: 2018-09-29 05:09 GMT
జన‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ళ్లీ కోపం వ‌చ్చింది. టీడీపీ నేత‌లు పిచ్చి వేషాలు వేస్తే స‌హించేది లేద‌ని మ‌రోసారి చెప్పారు. టీడీపీ నేత‌లు చిల్ల‌ర వేషాల వేస్తూ రౌడీయిజం.. గుండాయిజం చేస్తే ఊరుకునేది లేద‌న్నారు. అవ‌స‌ర‌మైతే సాయుధ పోరాటం చేస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అక్ర‌మార్కుల‌ను.. అవినీతిప‌రుల‌ను త‌రిమికొడ‌తామ‌న్న ఆయ‌న‌.. తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని కొల్లేరులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మొండికోడు రోడ్డుపై ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ నేత‌ల తీరుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. గురువారం రాత్రి తాను బ‌స చేసిన హోట‌ల్ వ‌ద్ద చింత‌మ‌నేని మ‌నుషులు చేసిన హ‌డావుడిపై స్పందించారు.

రాత్రి త‌న‌పై దాడుల‌కు వ‌చ్చార‌న్నారు. తాను ఏ ఎమ్మెల్యేకైనా ఒక‌టే చెబుతాన‌ని.. తానేమీ చేతులు ముడుచుకొని కూర్చునోన‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. "నా మీద దాడికి వ‌స్తే  నేనేమైనా చేతులు ముడ‌చుకుని కూర్చున్నానా?  నా సంగ‌తి వాళ్ల‌కి తెలీదు. నేను ఎంత‌టికైనా తెగిస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తాం. ఖ‌బ‌డ్డార్" అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీతో భుజం కాసినందుకు ఇప్పుడా భుజం న‌రికేశార‌ని.. ఈసారి ఎన్నిక‌ల్లో టీడీపీని గెలిపిస్తే.. స్వ‌యంగా అంద‌రి భుజాలు న‌రికేస్తార‌ని మండిప‌డ్డారు.

ప్ర‌భుత్వం దాడుల‌కు పాల్ప‌డుతున్న మహిళ‌ల‌కు.. అధికారుల‌కు జ‌న‌సేన అండ‌గా ఉంటుంద‌న్న ప‌వ‌న్‌.. వాళ్లు మ‌న‌పై దాడుల‌కు సిద్ధ‌ప‌డుతున్నారంటే మ‌నం బ‌ల‌ప‌డుతున్న‌ట్లు లెక్క అంటూ ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న తీవ్ర వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. అదే స‌మ‌యంలో ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల కార‌ణంగా కొత్త ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకునే అవ‌కాశం ఉందంటున్నారు. ఆచితూచి మాట్లాడ‌తాన‌ని చెప్పే ప‌వ‌న్‌.. ఈ త‌ర‌హాలో మాట్లాడ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News