ఏపీ రాజకీయ తెరపై జనసేనాని పవన్ కళ్యాణ్ కనిపించక చాలా రోజులైంది. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి పవన్ ఏపీలో కనిపించడం లేదు. హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఏపీ వ్యవహారాలను నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుత శ్రావణ మాసంలో మొదలుపెట్టిన దీక్ష నవంబర్ వరకు కొనసాగుతుందని అంటున్నారు. ముందు కేవలం శ్రావణ మాసం వరకు మాత్రమే అనుకున్నా.. నవంబర్ వరకు చేస్తే బాగుంటుందని స్వామీజీలు సలహాలు ఇచ్చారంట.. అందుకే అప్పటివరకు దీక్ష చేసి అప్పుడు గడ్డం తీస్తా అంటున్నాడని జనసేన సర్కిల్స్ లో జోరుగా మారు మోగుతోంది.
ఈ దీక్ష ప్రకారం సాయంత్రం అయ్యిందంటే బయటకు రాకూడదట.. నియమాలు, నిష్ట బాగా ఉందట.. అందుకే తన అన్న నాగబాబు కూతురు ఎంగేజ్ మెంట్ కు కూడా పవన్ కళ్యాణ్ హాజరుకాలేదని టాక్. అంత నిష్టగా పాటించడం వెనుక పెద్ద కథే ఉందని ప్రచారం జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ దీక్షతో జనసేన స్వరూపం మారిపోతుందని కొంతమంది జనసైనికులు విశ్వాసంగా ఉన్నారట.. జనసేన ఏపీలో బలంగా తయారవడంతోపాటు 2024లో అధికారమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఈ దీక్ష బూనినట్టు జనసేన నాయకులు ఆఫ్ ది రికార్డ్ గా అనుకుంటున్నారట..