జ‌న‌సేన సైనికుల ఎంపిక..వివ‌రాలు ఇవే..

Update: 2017-04-18 13:22 GMT
మిగ‌తా రాజకీయ పార్టీల‌కు భిన్నంగా...ఎంపిక ద్వారా త‌న‌తో క‌లిసి వ‌చ్చే వారిని జ‌న‌సేన‌లోకి తీసుకునేందుకు జ‌న‌సేన పార్టీ అధినేత - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో గ‌తంలో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన జ‌న‌సేన మొద‌టి ద‌శ‌లో అనంత‌పురంను ఎంచుకున్న‌ట్లు తెలిపింది. అందులో భాగంగా ఈనెల 21 నుంచి నియామ‌కం చేయ‌నున్న‌ట్లు పేర్కొంది. తాజాగా జ‌న‌సేన విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ఇది

రాజకీయాల్లో ప్రతిభావంతులైన యువకులు - మేధావులను భాగస్వామ్యుల్ని చేసే ఒక అభ్యుదయ ప్రయత్నానికి ఈనెల 21న అనంతపురంలో జనసేన శ్రీకారం చుడుతోంది. రాజకీయాల్లో అనువంశిక - ఆత్రిత పక్షపాత అవలక్షణాలను తుంచివేసి, కొత్త తరానికి క్రియాశీల‌క‌ స్థానం కల్పించడానికి తలపెట్టిన ఈ క్రతువును అత్యంత పవిత్రంగా, శ్రద్ధతో జరపాలని జనసేన కృతనిశ్చయంతో ఉంది. 3600 ధరఖాస్తులు రావడంతో మూడు రోజులపాటు అర్హత పరీక్ష జరపాలని నిర్ణయించాము. జనసేనకు చెడ్డ పేరు తేవాలని తలచేవారు ఈ పవిత్ర యజ్ఞంలో చొరబడకుండా జనసైనికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎంపికలు అత్యంత పారదర్శకంగా, ప్రతిభకు పట్టం కట్టేవిధంగా జరుగుతాయి. ఈ దిగువ తెలియచేసిన చిరునామా లో ఎంపికలు జరుగుతాయి. ఎంపిక సమయం, మిగిలిన వివరాలను ధరఖాస్తుదారులకు ఈ-మెయిల్ ద్వారా జనసేన ప్రతినిధులు తెలియచేస్తారు. janaSenaparty.org/antpresourcepersons.pdf లేదా జనసేన ఫేస్ బుక్ ద్వారా కూడ వివరాలు తెలుసుకోవచ్చు.

చిరునావా. జి.ఆర్.గార్డెన్స్ గొంగడి రామప్ప కాంపౌండ్ 3వ రోడ్ ఎక్స్ టెన్షన్, ఈస్ట్ గేటు అనంతపుర 515004`` అని వివ‌రించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News