పొద్దున్నే బుద్దిగా 9-5 ఎంప్లాయిలా ట్వీట్లు పెట్టే పవన్ ఈరోజు సడెన్ గా పొద్దున ట్విట్టరుకు డుమ్మా కొట్టారు. పవన్ కళ్యాణ్ ఏం ట్వీట్ చేస్తాడా? జై కొడదామా అని ఎదురుచూసిన ఆయన అభిమానులు, ఎవరి మీద ఈరోజు దాడి చేస్తారా? అని నెటిజన్లు, పవన్ కళ్యాణ్ ఏదైనా చెబితే రాసుకుందామని జర్నలిస్టులు ఎదురుచూస్తుండగా వాళ్లను పవన్ నిరాశపరిచారు. చాలా సేపు ట్వీటు రాకపోయేటప్పటికి ఈరోజు పవన్ రాడేమో అనుకున్నారు. కానీ వచ్చాడు. అయినా వారి కోరిక నెరవేరలేదు.
ఎందుకంటే కొన్ని మీడియాల మీద వరుసగా ట్వీట్లతో అటాక్ చేస్తున్న పవన్ ఈరోజు డైవర్ట్ అయ్యాడు. అనారోగ్యంతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్ పరికర్ స్వస్థతను కోరుతూ ఆయన ట్వీట్స్ పెట్టారు. ఆయనపై వచ్చిన క్లిప్పింగ్ పోస్టు చేసి తన పరామర్శను ఒక ఫొటోగా పెట్టారు. వెంటనే ఆ ట్వీట్లు డిలీట్ చేసి మళ్లీ టెక్ట్స్ రూపంలో మనోహర్ క్షేమాన్ని కోరుతూ ట్వీట్ చేశారు.
ఇంతకీ పవన్ ఏమన్నారంటే... *మనోహర్ పారికర్ జీ - 2014లో కలిసి చేసిన ప్రయాణం నాకు ఇంకా గుర్తుంది. మీరెంతో విజ్ఞత-విజన్ కలిగిన నేత. మీకు అనారోగ్యం నుంచి కోలుకునే శక్తి ఆ ప్రకృతి మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను* అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
మొత్తానికి ఈ ట్వీటు చూస్తే పవన్ మీడియా నుంచి విషయాన్ని డైవర్ట్ చేసినట్లు అర్థమవుతోంది. ఎందుకంటే ఏబీఎన్ రాధాకృష్ణ పవన్ కళ్యాణ్ కు నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్న శ్రీనిరాజుది ట్వీట్ చేసినపుడు ఇపుడు ఆర్కే ఇచ్చిన లీగల్ నోటీసు ట్వీటు చేయకపోవడంతో అందులో ఏముందన్ని ఇపుడు ఆసక్తిగా మారింది. అది ఓకే.. అసలు పవన్ మీడియాపై దాడిని ఆపేశాడా? ఎందుకు ఈరోజు మీడియాపై ట్వీట్లు పొద్దున్నే మొదలుపెట్టలేదు అని ఆరా తీస్తూ జనం రూమర్లు సృష్టించడం మొదలుపెట్టాడు. మరి... ఏమవుతుందో చూద్దాం.