పవన్ కళ్యాణ్ పెద్ద షాకే ఇచ్చాడుగా..

Update: 2017-05-03 07:55 GMT
పవన్ కళ్యాణ్ నెమ్మదిగా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోతున్నాడు. ఇది వరకు పార్ట్ టైం రాజకీయాలకు పేరుపడ్డ జనసేన అధినేత.. 2019 ఎన్నికల బరిలోకి దిగాల్సిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పాలిటిక్స్ మీద శ్రద్ధ పెడుతున్నట్లున్నాడు. గత కొన్ని రోజులుగా అన్ని ప్రధానాంశాల మీదా స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు జనసేన తరఫున ప్రకటనలు ఇస్తున్న పవన్.. తాజాగా సగటు రాజకీయ నేత లాగా ఓ పరామర్శకు వెళ్లడం విశేషం. మూడు రోజుల కిందట జూబ్లీహిల్స్ లోని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధాన కార్యాలయంలో  అగ్ని ప్రమాదం చోటు చేసుకుని.. రెండు ఫ్లోర్లకు పైగా కాలిపోయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు పరామర్శలకు క్యూ కట్టేస్తున్నారు. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సైతం ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించి వచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతోనూ మాట్లాడారు. కేసీఆర్ ఆంధ్రజ్యోతిని సందర్శించడం ఎంత చర్చనీయాంశమైందో.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లడం కూడా అంతే చర్చకు దారి తీసింది. రాధాకృష్ణ అక్కడ లేనపుడు.. ముందస్తు సమాచారం ఏమీ లేకుండా పవన్ అక్కడికి వెళ్లిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సడెన్ గా పవన్ అక్కడ ప్రత్యక్షమయ్యే సరికి ఆంధ్రజ్యోతి సిబ్బంది షాకైపోయారట. ఓపిగ్గా సిబ్బంది అందరినీ పలకరించిన పవన్.. ఆంధ్రజ్యోతిలోని పెద్ద రిపోర్టర్లతో సమకాలీన రాజకీయాలపైనా మాట్లాడినట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News