ఎంతైనా పవన్ తీరే వేరబ్బా. ఆయన ఎంత డౌన్ టు ఎర్తో తెలుసా? మూర్తీభవించిన మానవత్వం ఆయన సొంతం. కష్టాలు విన్నంతనే కరిగిపోతాడు. తోటి మనిషిని ఎంత గౌరవిస్తారో.. ఎంతగా అభిమానిస్తారో తెలుసా? అంటూ చాలా మాటలు చెబుతుంటారు పవన్ అభిమానులు. నిజమే.. వారి చూసినప్పుడు అలానే ఉండొచ్చు.
ఎవరి కంటా పడని కొన్ని సంగతులు ప్రతి ఒక్కరిలో చాలానే ఉంటాయి. అయితే.. చుట్టూ పదుల సంఖ్యలో ఉన్న వేళలోనూ.. తాను నిత్యం వల్లించే గౌరవ మర్యాదలు పవన్ సార్ ఎంతగా పాటిస్తారన్న విషయాన్ని తెలిపే వైరల్ వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది.
షాకింగ్ గా మారిన ఈ వీడియోలో పవన్ కొత్త రూపం బయటకు రావటమే కాదు.. ఆఫ్ కెమేరాలో ఆయన ఇలా వ్యవహరిస్తారా? అన్న క్వశ్చన్ రావటం ఖాయం. తాజాగా జనసేన ప్రెస్ మీట్ ఒక పవన్ ఏర్పాటు చేశారు. దీనికి పార్టీకి సంబంధించిన పలువురితో పాటు.. మీడియా మిత్రులు హాజరయ్యారు. చిన్న రూము.. తగిన ఏర్పాట్లు చేయకపోవటంతో తామే మంచి విజువల్స్ క్యాప్చర్ చేయాలన్న తహతహతో కెమేరామెన్లు తమకు అనుకూలంగా ఉన్న చోట్ల కెమేరా స్టాండ్లు పెట్టేశారు. అక్కడికి వచ్చిన పవన్.. కెమేరాలు ఎక్కడెక్కడ ఉండాలో చెప్పటమే కాదు.. జూమ్ ఉందిగా.. దాన్ని వాడి వీడియో తీసుకో.. అని చెప్పటమే కాదు.. కెమేరామెన్లను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడటం కనిపించింది.
అంతేనా.. తమ టీవీ ఛానల్ అయిన 99ఛానల్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వటం.. మిగిలిన వారిని విసుగుతో కూడిన స్వరంతో మాట్లాడటం ఆ వైరల్ వీడియోలో కనిపిస్తోంది. నువ్వు.. బాబు.. వెళ్లు.. లాంటి పదాలతో పవన్ విసుక్కోవటం లాంటివి చూస్తే.. పవన్ లోని మంచితనం.. మానవత్వం ఏమైందన్న క్వశ్చన్ కలగక మానదు. సమాజాన్నిప్రభావితం చేసే జర్నలిస్టుల విషయంలోనే పవన్ ఇలా వ్యవహరిస్తే.. మిగిలిన వారి విషయంలో మరెలా వ్యవహరిస్తారన్న ప్రశ్న పలువురిలో వ్యక్తమవుతోంది. పవన్ లోని కొత్త కోణాన్ని చూపించే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Full View