జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు పర్యటించబోతున్నారు. వివిధ కారణాలతో చనిపోయిన పార్టీ క్రియాశీల సభ్యుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్ధికసాయాన్ని అందించేందుకు ఈ పర్యటన పెట్టుకున్నారు. ఇంతవరకు మంచి కార్యక్రమమే కానీ ఈ సందర్భంగా పవన్ ఏమి మాట్లాడబోతున్నారనే విషయం కీలకంగా మారింది. అసలు పవన్ ఏమన్నా మాట్లాడుతారా అనేది కూడా అనుమానంగా మారింది.
ఎందుకంటే తెలంగాణాలో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేయాలని ఎప్పుడో పిలుపిచ్చారు. అయితే ఆ పిలుపు ఏమైందో ఎవరికీ తెలీదు.
సభ్యత్వాలు ఎంతవరకు వచ్చిందో కూడా క్లారిటీ లేదు. ఒకవైపు ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మరోవైపు సభ్యత్వాల తాజాస్దితిపై అతీగతీ లేదు. ఇదే సమయంలో తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు.
అలాగే ఏపీలో బీజేపీతో ఉన్న పొత్తు తెలంగాణ లో ఉందో లేదో తెలీక జనసైనికుల్లో అయోమయం పెరిగిపోతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తారో లేదో తెలీనపుడు సభ్యత్వం ఎంత చేసి మాత్రం ఉపయోగం ఏమిటనే చర్చ పార్టీలోనే జరుగుతోంది. ఏపీలో ఎక్కడ పర్యటించినా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వంపై ఏ స్ధాయిలో పవన్ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారో అందరు చూస్తున్నదే.
ఇదే తెలంగాణాకు వచ్చేసరికి పవన్ సైలెంట్ గా ఉన్నారు. కేసీయార్ తో పొత్తు లేదు, బీజేపీతో తెలంగాణలో పొత్తుందో లేదో కూడా అయోమయమే. మరో పార్టీతో పొత్తులు పెట్టుకునే అవకాశాలు లేదు. మరిలాంటి సమయంలో పవన్ స్వేచ్చగా అన్నీ పార్టీలపైనా తనదైన స్టైల్లో ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోవచ్చు.
కానీ పవన్ ఆ పని మాత్రం చేయటం లేదు. కేసీయార్ పై ఈ మధ్య కాలంలో విమర్శలు చేయడం లేదు. అందుకనే నల్గొండ జిల్లా పర్యటనలో ఏమైనా మాట్లాడుతారా అనే ఉత్కంఠ మొదలైంది. మరి ఏమి చేస్తారో చూడాల్సిందే.