ప‌వ‌న్‌కు బాబు.. బాబుకు ప‌వ‌న్‌.. రాజ‌కీయ కోలాట‌మేనా..!

Update: 2022-10-21 04:56 GMT
రాజ‌కీయంగా ఎవ‌రు ఎవ‌రితో పొత్తులు పెట్టుకున్నా.. ఒక‌పార్టీపై మ‌రోపార్టీ ఆధార‌ప‌డ‌డ‌మే కదా! సొంత‌గా ప్ర‌య‌త్నించే అవ‌కాశం(కొంద‌రు దీనిని స‌త్తా అని కూడా అనొచ్చు) లేన‌ప్పుడు.. ఇలా పొత్తులు పెట్టుకుంటార‌ని చెబుతారు. తాజాగా ఏపీలో టీడీపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకుందా..?  లేక జ‌న‌సేన‌తో టీడీపీ చేతులు క‌లిపిందా? అంటే.. చెప్ప‌డం క‌ష్ట‌మే. ఎందుకంటే.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో.. పార్టీకి బ‌లం ఉంది.. బూత్ స్థాయి నాయ‌కులు ఉండి.. 14 ఏళ్ల‌పాటు.. పాల‌న సాగించిన పార్టీ టీడీపీ. సో.. అలాంటి పార్టీ.. జ‌న‌సేన‌ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం.. ఒక పార్ట్ అయితే.. అస‌లు.. త‌మ‌కు ఏమీ బ‌లం లేద‌ని.. భావిస్తున్న జ‌న‌సేన‌(అంటే.. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు లేక పోవ‌డం.) టీడీపీకి చేరువైందా? అనేది చ‌ర్చ‌.

పైకి మాత్రం టీడీపీఅధినేత చంద్ర‌బాబు స్వ‌యంగా వెళ్లి.. ప‌వ‌న్‌ను క‌లిశారు.. కాబ‌ట్టి.. ప‌వ‌న్‌దే పైచేయి అనాలి. జ‌న‌సేనే బ‌లంగా ఉంద‌ని.. చంద్ర‌బాబు  విశ్వ‌సిస్తున్నార‌ని భావించాలి. కాబ‌ట్టి.. ఈ పొత్తు వ్య‌వ‌హారంలో టీడీపీపై జ‌న‌సేన‌దే పైమాటగా ఉంటుందనే అంచ‌నా వుంది.

అదేస‌మ‌యంలో జ‌న‌సేన‌కు క్షేత్ర‌స్థాయిలో బ‌లం లేదు కాబ‌ట్టి.. త‌మ‌దే పైచేయి అవుతుంద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. దీంతో ఎవ‌రిది ''పైచేయి?'' అనేది ఆస‌క్తిగా మారింది. ఇదిలావుంటే.. ఎవ‌రిది పైచేయి అనేది ప‌క్క‌న పెడితే.. రేపు ఎన్నిక‌ల్లో ఎవ‌రి స‌త్తాతో గెలుపు గుర్రం ఎక్కుతార‌నేది కూడా ముఖ్యం. ఇక్క‌డ ఏమాత్రం తేడా జ‌రిగినా.. రెండు పార్టీల‌కూ.. ఇబ్బంద‌నేది మ‌రో విశ్లేష‌ణ‌.

ఇక‌, టికెట్ల కేటాయింపులో.. తమ వాద‌నేనెగ్గించుకునేందుకు జ‌న‌సేన రెడీగా ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎందుకంటే.. త‌మ వ‌ద్ద‌కే చంద్ర‌బాబు వ‌చ్చారు క‌నుక‌.. తాము కోరిన‌న్ని సీట్లు ఇవ్వాల‌ని, ఇస్తార‌ని బావిస్తున్న‌ట్టు నాయ‌కులు చెబుతున్నారు. కానీ,  టికెట్లు ఇచ్చినా.. అభ్య‌ర్థులు లేని పార్టీ క‌నుక‌.. తాము ఇచ్చిన‌న్ని తీసుకుంటార‌ని.. టీడీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు.

అయితే.. ఇప్పుడే ఇవ‌న్నీ ఎందుకు ఎన్నిక‌ల ముందు చూసుకుందామ‌నే నాయ‌కులు కూడా రెండు పార్టీల్లోనూ క‌నిపిస్తున్నారు. ఇలా.. మొత్తంగా ఈ రెండు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ కోలాటం అప్పుడే ప్రారంభ‌మైంది.

నిజానికి ఎన్నిక‌లు జ‌రిగేందుకు ఇంకా.. ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల మ‌ధ్య‌.. పొత్తు ఎలా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో పార్టీని ముందుకు న‌డిపించేందుకు జ‌న‌సేన, టీడీపీ నేత‌లు ఇగోల‌ను ప‌క్క‌న పెట్టి చేతులు క‌లుపుతారా?  లేదా? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌న‌సులు క‌లిసినా.. క‌ల‌వ‌క‌పోయినా.. చేతులు క‌ల‌ప‌డం.. జ‌రుగుతుందా? అనేది చ‌ర్చ‌. ఎందుకంటే.. వైసీపీ ఇప్ప‌టికే మ‌హిళా సెంటిమెంటును రెచ్చ‌గొట్టింది. ప‌వ‌న్ మూడు పెళ్లిళ్ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌నుంది. ఇది.. జ‌న‌సేన‌పై ఎఫెక్ట్ అవుతుంది. సో. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ నేత‌లు ఏం చేస్తార‌నేది ఆస‌క్తి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News