కేటీఆర్ స‌వాల్‌ కు ప‌వ‌న్ స‌మాధానం ఇదే!

Update: 2022-08-07 07:30 GMT
ఆగ‌స్టు 7 జాతీయ చేనేత దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ విసిరిన స‌వాల్ కు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మాధాన‌మిచ్చారు. నేత‌న్న‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని, కేంద్ర ప్ర‌భుత్వం చేనేత ఉత్ప‌త్తుల‌పై విధించిన జీఎస్టీని రద్దు చేయాల‌ని, అలాగే ఇత‌ర ప‌న్నుల‌ను ఎత్తివేయాల‌ని, చేనేత ఉత్ప‌త్తుల ఎగుమ‌తుల‌కు ఉన్న అన్ని అడ్డంకుల‌ను తొల‌గించాల‌ని కేటీఆర్ త‌న ట్వీట్ లో కేంద్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

అలాగే జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా చేనేత వ‌స్త్రాలు ధ‌రించి, వాటిని సోష‌ల్ మీడియాలో పోస్టులు చేయాల‌ని మ‌హీంద్రా గ్రూప్ అధిప‌తి ఆనంద్ మ‌హీంద్రా, ప్ర‌ముఖ క్రికెట‌ర్ భార‌త‌రత్న స‌చిన్ టెండూల్క‌ర్, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌దిత‌రుల‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు. అంతేకాకుండా తాను చేనేత వ‌స్త్రాల‌ను ధ‌రించిన ఫొటోల‌ను కూడా పోస్టు చేశారు. ఈ స‌వాల్ ను స్వీక‌రించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ చేనేత వ‌స్త్రాల‌ను ధరించిన ప‌లు ఫొటోల‌ను ట్విట్ట‌ర్ లో పోస్టు చేశారు. త‌న‌కు చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా స‌వాల్ విసిరినందుకు కేటీఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ చేనేత‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని కోరారు.

అదేవిధంగా ప‌వ‌న్ మ‌రో ముగ్గురికి త‌న స‌వాల్ ను విసిరారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఒంగోలు, నెల్లూరు జిల్లాల కోఆర్డినేట‌ర్ బాలినేని శ్రీనివాస‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, ఆ పార్టీ ఓబీసీ విభాగం జాతీయ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ను ఈ చాలెంజ్ కు నామినేట్ చేశారు. కాగా త‌న చాలెంజ్ కు స్పందించినందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్ హ్యాష్ ట్యాగుతో ఈ చాలెంట్ ట్విట్ట‌ర్ లో ట్రెండ్ అవుతోంది.
Tags:    

Similar News