ప‌వ‌న్ ఏకేసినా.. ఇంత మౌన‌మేల‌....!

Update: 2022-10-30 06:07 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఇటీవ‌ల కాలంలో మండిప‌డుతున్న వైసీపీ నాయ‌కుల సంఖ్య పెరుగుతుండ‌డం తెలిసిందే. ముఖ్యంగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తివ్వ‌డాన్ని వారు స్వాగ‌తించ‌లేక పోతున్నారు. దీనికితోడు.. విశాఖ‌పై త‌మ‌కున్న ఆలోచ‌న‌ల‌ను ఎక్క‌డ మార్చేస్తాడో.. అనే ఆవేద‌న కూడా.. వైసీపీలో క‌నిపిస్తోంది. దీంతో ప‌వ‌న్‌పై తీవ్ర‌స్తాయిలో విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ ర‌గ‌డ పీక్ స్టేజ్‌కు వెళ్లిపోయిందనేది ప‌రిశీల‌కుల మాట‌. ఇదిలావుంటే, తాజాగా ఏడుగురు మంత్రుల‌ను తీవ్ర‌స్థాయిలో ఏకేస్తూ ప‌వ‌న్ ట్వీట్ చేశారు.

మంత్రులు బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, బొత్స స‌త్యనారాయ‌ణ‌, గుడివాడ అమ‌ర్నాథ్‌, దాడిశెట్టి రాజా, రోజా, విడ‌ద‌ల ర‌జ‌నీ, అంబ‌టి రాంబాబుల‌పై ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. మీరు బాధ్య‌త‌లు చేప‌ట్టి.. ఇన్నాళ్ల‌లో మీమీ శాఖ‌ల‌కు చేసిన ప‌నులేంటో చెబుతారా? అంటూ.. ప్ర‌శ్నించారు. ఒక్కొక్క‌రినీ పేరు పేరునా ఆయ‌న నిల‌దీశారు. అయితే.. నిత్యం ఫైర్ అయ్యే.. ఈ మంత్రులు తాజాగా ప‌వ‌న్ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు అస‌లు తెలియ‌న‌ట్టే న‌టించా రు. ప్ర‌తి ఒక్క‌రినీ ప‌వ‌న్ నిలువునా క‌డిగేసినా ఎవ‌రూ కూడా నోరు విప్ప‌లేదు. దీంతో వారికి ఈ విష‌యం తెలుసా.?  తెలియ‌దా? అనే సందేహం కూడా వ‌చ్చింది.

అయితే.. ప‌వ‌న్ చేసిన ఈ  ప్ర‌శ్నల ట్వీట్‌ను వారు కూడా చూశారు. కానీ, చెప్పుకోవ‌డానికి ఏమీ లేదు. పైగా చెప్పినా కూడా దీనిపై మ‌రింత ర‌చ్చ జ‌రుగు తుందే త‌ప్ప ప్ర‌యోజ‌నం ఉండ‌దు అందుకే మౌన‌మే బెట‌ర్ అన్న‌విధంగా వ్య‌వ‌హ‌రించార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మంత్రి వ‌ర్గం చేసింది ఏమీ లేద‌నేది వాస్త‌వం. అందుకే, ఎవ‌రికి వారు మౌనంగా ఉంటున్నారు. ఎవ‌రిని క‌దిలించినా త‌మ శాఖ‌లో నిధులు లేవు అంటున్నారు. మ‌రికొంద‌రు అస‌లు చేసేందుకు ప‌నికూడా లేద‌ని చెబుతున్నారు. దీంతో ఆయా నేత‌లు చేసేది లేక రాజ‌కీయంగా కామెంట్లు కురిపిస్తూ.. కాల‌క్షేపం చేస్తున్నార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News