ఏపీలో ఇపుడు ఇప్పటం హాట్ టాపిక్. ఈ ఊరు పేరు ఇపుడు మారుమోగుతోంది. దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్ళి చేసిన హల్ చల్. ఇప్పటంలో ఇళ్ళు కూల్చేస్తున్నారు అన్న వార్త అయితే మీడియా ఊదరగొట్టింది. నిజానికి ఇప్పటంలో ఆ సీన్ ఉందా. అక్కడ ఎన్ని ఇళ్ళు కూలగొట్టారు. ప్రత్యేకించి జనసేన వారు ఆరోపిస్తున్నాట్లుగా ఇప్పటం లో ఆ పార్టీ ఆవిర్భావ సభకు ఇప్పటంలో స్థలాన్ని ఇచ్చినందుకు వారి మీదనే ప్రభుత్వం కక్ష కట్టి జేసీబీలను అక్కడికి తోలింది అన్న దాంట్లో ఎంతవరకూ నిజం అన్నది చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి.
ఇప్పటం అనది ఒక అందమైన గ్రామం. అక్కడ ప్రజలు అంటా అన్నదమ్ములుగా కలసి మెలసి ఉంటారు. నిన్నటిదాకా గ్రామ పంచాయతీ. ఇపుడు కార్పోరేషన్ లో కలిసింది. దాంతో ఆ ఊరుకీ అభివృద్ధి కావాలి. పైగా అటు మంగళగిరికి ఇటు తాడేపల్లికి కనెక్ట్ చేస్తూ ఇప్పటం గ్రామాన్ని అభివృద్ధి చేస్తే మంచిదే. అక్కడ రోడ్లను విస్తరిస్తే బస్సులు వస్తాయి. ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరిగి ట్రాఫిక్ హెచ్చు అవుతుంది. అలాగే అక్కడ ఇళ్లకు భూములకు డిమాండ్ వస్తుంది.
ఇది ఈ రోజు డిమాండ్ కాదు. రెండు దశాబ్దాలుగా తమ ప్రాంతాన్ని బాగు చేయమని ఇప్పటం గ్రామస్తులు కోరుతున్నారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఇప్పటాన్ని రోడ్లు వెడల్పు చేసి అభివృద్ధి చేయాలనుకున్నారు. కానీ ఎందుకో మార్కింగ్ మాత్రమే వేసి వదిలేసారు, చివరికి ఆ పని జరగలేదు. ఇక వైసీపీ వచ్చాక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి ఈ విషయం తెలియచేశారు. అయితే ఆయన కూడా ఇప్పటం విషయంలో దృష్టి పెట్టడానికి ఇంతకాలం పట్టింది. ఇక ఇప్పటంలో రోడ్ల విస్తరణ పనులకు జనవరిలోనే టేండర్లు పిలిచారని తెలుస్తోంది
ఇక జనసేన సభ మార్చిలో జరిగింది. అంటే తమ సభకు ఇప్పటం రైతులు స్థలం ఇచ్చారు కాబట్టి అక్కడ జేసీబీలను దించారు అన్నది అబద్ధమని అధికారులు అంటున్నారు. ఇక ఇప్పటంలో రోడ్ల విస్తరణ కోసం అడ్డంగా ఉన్న ఆక్రమణలను, కొన్ని ప్రహారీ గోడలను మాత్రమే కూల్చారు తప్ప ఎక్కడా ఇళ్లను కూల్చలేదు. ఆ విధంగా చూస్తే ఇళ్లను కూల్చేశారు అన్నది రెండవ అబద్ధమని అంటున్నారు.
ఇక జనసేన సానుభూతిపరుల ఇళ్లనే కూల్చేస్తున్నారు అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటంలో జనసన సానుభూతిపరుడికి చెందిన ఒకరి ప్రహారీ గోడనే కూల్చేశారు. అయితే ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటంలో టూర్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే డెబ్బై అడుగులు వెడల్పు ఉంది. దాన్ని 120 అడుగుల రోడ్డు ఎందుకు చేయాలని అన్నారు. దీనికి మునిసిపాలిటీ అధికారులు ఇస్తున్న వివరణ ఏంటి అంటే ప్రస్తుతం ఇప్పటం రోడ్లు జస్ట్ 50 నుంచి 60 అడుగులు మాత్రమే ఉన్నాయి. వాటిని 73 నుంచి 80 అడుగుల దాకా పెంచాలన్నదే ఈ విస్తరణ ఉద్దేశ్యమని చెబుతున్నారు.
ఇక రోడ్ల విస్తరణ పనుల కోసం ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలలోనే నోటీసులు ఇచ్చారు. ఇక రోడ్లను ఆక్రమించుకున్న వారికి 53 మందిని గుర్తిస్తే అందులో జనసేన సానుభూతిపరుడు ఒకరు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అలా చట్ట ప్రకారం ఆక్రమణల మీద నోటీసులు జారీ చేసి వాటిని తొలగించే అధికారము ప్రభుత్వానికి ఉంది అని వారు చెబుతున్నారు.
అలా 53 ఆక్రమణలను గుర్తించి చర్యలకు అధికారులు పూనుకున్నారు. ఇలా ఆక్రమణలకు పాల్పడిన వారిలో కాపులు 28 ఉంటే రెడ్లు 13, బీసీలు 12 మంది ఉన్నారు. అంటే అన్ని కులాల వారూ ఉన్నారు అన్న మాట.
ఇదిలా ఉండగా రోడ్ల విస్తరణకు తాము సహకరించామని తమ ఇంటి ప్రహారీ కూడా పోయిందని ఇప్పటం గ్రమస్థుడు లచ్చి వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఇదంతా రాజకీయం కోసమే చేస్తున్నారని, ఎవరి ఇళ్ళూ కూల్చలేదని ఆయన అంటున్నారు.
ఇప్పటానికి స్కూల్ బస్సులు రావడమే ఇబ్బందిగా ఉందని, అందువల్ల రోడ్లు వెడల్పు చేయాల్సిందే అని వీరంకి బాజీ అంటున్నారు. ఇది పూర్తిగా అభివృద్ధి కార్యక్రమం తప్ప రాజకీయం ఇందులో లేదని ఆయన అంటున్నారు. ఆక్రమణలు తొలగిస్తే ఇళ్ళు కూల్చారంటూ జనసేన వారు ప్రచారం చేశారని, పవన్ వచ్చి ఎవరిని పరామర్శిస్తారు అని ఇప్పటానికి చెందిన మోదుగుల బ్రహ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
తమకు అభివృద్ధి కావాలని, ఇక్కడ ప్రజలంతా ఒక్కటేనని, అంతా అన్నదమ్ములుగా ఉంటామని, రాజకీయాలు వద్దని ఆయన అంటున్నారు. మొత్తానికి ఇదీ ఇప్పటం మ్యాటర్. అయితే హడావుడు హంగామా మాత్రం ఇప్పటం గురించి బయట చాలా ఎక్కువగానే జరిగింది. అసలు విషయాలు కేవలం ఇప్పటం వారికే తెలుసు. మరి ఇంతలా తెగించి ఇప్పటం గురించి అసత్యాలు చెప్పటం పక్కా రాజకీయమే అంటున్నారు.