జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన పార్టీ ఆవిర్భావ స్పీచ్ లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో చెప్పిన రీతిలోనే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చే అవకాశం లేదన్న ఆయన.. చంద్రబాబు మీద తనకు ప్రత్యేకమైన ప్రేమ.. అనురాగం లేదు కానీ గౌరవం ఉందన్న విషయాన్ని చెప్పటం ద్వారా.. తానేమిటన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో తాను పొత్తుల కోసం పాకులాడటం లేదని.. ఏదైనా గౌరవప్రదంగా ఉండాలన్న విషయాన్ని ఆయన తన మాటల్లో స్పష్టం చేశారని చెప్పాలి.
అదే సమయంలో పలు అంశాల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాపుల దైవంగా భావించే వంగవీటి మోహన రంగా విషయాన్ని ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. ‘వంగవీటి రంగా కమ్మవారి ఆడపడుచును పెళ్లి చేసుకున్నారు. అక్కడ లేని కులం మీకెందుకు? రంగాయే కాదు కాపుల్లోని చాలామంది నాయకులు వేరే కులాల వారిని పెళ్లి చేసుకున్నారు. అయినా ఇంకా కులం అని పట్టుకొని వేలాడదామా? కులం కులం అని చచ్చిపోదామా? ఇవన్నీ ఎందుకు ఆలోచించటం లేదు?’’ అని సూటిగా ప్రశ్నించారు.
కులం చూసి ఓటేస్తారో? గుణం చూసి ఓటేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలన్న పవన్.. ముఖ్యమంత్రి తమ కులం వ్యక్తి అని ఓట్లేస్తారని.. ఆయన నిజంగా మహానుభావుడే అయితే తాను రాజకీయాల్ని వదిలేస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకున్న అవగాహనలో అణగారిన కులాలన్నింటికీ అండగా ఉండాలని చెబుతుందని.. కమ్మ.. రెడ్డి తదితర సామాజిక వర్గాలను ద్వేషించకూడదని చెబుతుందని.. గొడవలు పెట్టకూడదని చెబుతుందన్నారు.
ఏపీలో ఒక కులపు పెత్తనం ఆగిపోవాలని.. అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం రావాలంటే జనసేన పాలనను తీసుకురావాలన్నారు. ఆగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని.. ఈ దేశం అన్యాయం చేస్తుందని అగ్రకుల పేదలు.. యువతలో కడుపు మంట ఉందని.. వారికి అండగా ఉంటామన్నారు. రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యేలకు దోచుకోవటానికి, ఎన్నికలకు రూ.150 కోట్లు ఖర్చు పెట్టేంత డబ్బు ఉంది కానీ పేదలకు ఉపకార వేతనాలు ఇచ్చేందుకు డబ్బుల్లేవన్నారు.
తాను ఎంతో ఇష్టపడిన ప్రధాని మోడీని కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎదిరించాల్సి వచ్చిందన్నారు. కానీ.. ఏపీ ప్రజలు తన వెంట నడవలేదన్నారు. పాతిక మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఇప్పుడు మెడలు వంచి దండాలు పెడుతున్నారన్నారు. రాష్ట్రం కోసం తాను నిలబడితే.. ప్రజలు.. యువత నిలబడలేదన్నారు. తెలంగాణలో అయితే యువత గొంతులు కోసేసుకున్నారని.. ఇక్కడ యువత కులాల చట్రంలో ఇరుక్కుపోవటంతో పోరాటస్ఫూర్తి లేకుండా పోయిందన్నారు.
ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందని చెబుతున్నా.. మా కులపోడు కాదనుకుంటారు. మీరు కాదనుకోవటం వల్ల నాకు పడ్డ శిక్ష.. నేను ఒంటరివాడిని అయ్యాను. ధర్మాన్ని పట్టుకొని నిలబడితే అందరూ వదిలేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గోదావరి జిల్లాలకు వెళ్లి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వబోనని కరాఖండీగా చెబితే ఎందుకు ఓట్లు వేశారు? కాపుల తప్పు కూడా ఉంది కదా? కాపు ఓటర్లు తప్పు చేసి కులంలో పుట్టినందుకు నన్ను దూషిస్తే ఏం ప్రయోజనం? కులాలకు.. మతాలకు అతీతంగా ఉండే వ్యక్తి మీ కులంలో పుట్టాడంటే మీకు గర్వకారణం కాదా? సొంత కులానికే అన్నీ చేసుకుంటున్నాడని ఇప్పుడున్న సీఎంను అందరూ తిడుతున్నారు కదా? నేను అలా అవ్వలేనే?
కమ్మవారి కొమ్ముకాస్తున్నామని ఇక్కడ ఉన్న ఒక నాయకుడు అంటున్నాడు. నన్ను తిట్టే కాపు నాయకులంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఊడిగం చేస్తున్నారని నేను తిట్టలేనా? నాకు అది రాదన్నారు. రంగా కాపులకు ఆరాధ్యదైవమని.. ఆయన తనను చంపేస్తున్నారని చెప్పినా కుల నాయకులు ఎందుకు అండగా నిలవలేదు?అని ప్రశ్నించారు. చనిపోయిన తర్వాత ఆయనకు విగ్రహాలు పెడితే ప్రయోజనం ఏమిటి? అంటూ సూటిగా ప్రశ్నించారు.
విశాఖ ఉక్కు అంశం భావోద్వేగమని.. సొంత గనులు కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోడీని ధైర్యంగా అడిగాను. ‘‘నా మీద కేసుల్లేవు.. అందుకే ధైర్యంగా మాట్లాడగలిగా. విశాఖ ఉక్కు సంగతి చూడాలని కోరా. కానీ.. అది జరగాలంటే కార్మిక సంఘాలు కదలి రావాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలి కదా. రాష్ట్రమంతా ఒక రోజు బంద్ చేస్తే గనులు ఎందుకు ఇవ్వరు? అక్కడి కార్మికులకే కోపం రాలేదు. చేతలు ఎత్తమంటే అనుమానంగా ఎత్తుతున్నారు. వారికే లేనప్పుడు నేను మోడీతో ఎన్నిసార్లు గొడవ పెట్టుకోను?’’ అంటూ ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టేశారు.