వీర మ‌హిళ‌ల‌తో ప‌వ‌న్ ఫొటో అదిరిపోయిందిగా..!

Update: 2022-07-03 07:30 GMT
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జోరు పెంచేశారు. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు.. ఇలా రెండు ప‌డ‌వ‌ల మీద విజ‌య‌వంతంగా ప్ర‌యాణిస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ నాలుగు సినిమాల‌ను లైనులో పెట్టేశారు. త‌న‌తో గ‌బ్బ‌ర్ సింగ్ వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ తెర‌కెక్కించిన హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ చేస్తున్న ప‌వ‌న్, వినూత్న చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంలో న‌టిస్తున్నారు. అలాగే సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ అభిమాని, ఖమ్మం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రామ్ తాళ్లూరి నిర్మించే చిత్రం కూడా లైనులో ఉంది. అలాగే వినోదయ సీతం తెలుగు రీమేక్‌లో కనిపించనున్నారు. ఇందులో ప‌వ‌న్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించనున్నారు. ఈ చిత్రానికి ప్ర‌ముఖ న‌టుడు సముద్రఖని దర్శకత్వం వహించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

మ‌రోవైపు రాజ‌కీయాల్లోనూ ప‌వ‌న్ ఈ మ‌ధ్య‌కాలంలో చురుకుగా వ్య‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికే నాలుగు జిల్లాల్లో జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర చేప‌ట్టారు. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతు కుటుంబాల‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాగే తాజాగా జ‌న‌వాణి పేరుతో కొత్త కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఇందులో భాగంగా ప్ర‌జ‌లు త‌మ స‌మస్య‌ల‌పై అర్జీల‌ను స్వీక‌రిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మం జూలై 3న విజ‌య‌వాడ‌లో ప‌వ‌న్ చేప‌ట్టారు.

మ‌రోవైపు మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌న‌సేన వీర మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇప్పిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌ల‌ను ఎలా తిప్పికొట్టాలి?   ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించి చెప్ప‌డం త‌దిత‌రాల‌పై వీర మ‌హిళ‌ల‌కు జ‌న‌సేన శిక్ష‌ణ శిబిరం ఏర్పాటు చేసింది.  ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ జ‌న‌సేన వీర మ‌హిళ‌ల‌తో దిగిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన శ్రేణులు ఈ పిక్ కు లైకులు, షేర్లు, కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫొటో సోష‌ల్ మీడియాగా ట్రెండీగా మారింది.

పార్టీ కార్యాల‌యంలో జ‌న‌సేన వీర మ‌హిళ‌ల‌తో ప‌వ‌న్ న‌వ్వుతూ ఫొటోల‌కు పోజులిచ్చారు. ఎప్పుడూ గ‌డ్డంతో క‌నిపించే ప‌వ‌న్ ఈసారి క్లీన్ షీవ్ తో క‌నిపిస్తున్నారు. ప‌వ‌న్ తో ఫొటో దిగిన ఆనందం ఫొటోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.
Tags:    

Similar News