ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ వినవస్తున్న ప్రచారానికి సీనియర్ మోస్ట్ మినిస్టర్, జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తూచ్ అనేశారు. ముందస్తు ఎన్నికలు ఏపీలో ఎందుకు వస్తాయని ఆయన అంటున్నారు. ముందస్తు మీద అన్నీ ఊహాగానాలే అని పెద్దిరెడ్డి అంటున్నారు.
తమ పార్టీకి అలాంటి ఆలోచనలే లేవు అని ఆయన పక్కాగా క్లారిటీ ఇచ్చేశారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వస్తాయని పెద్దిరెడ్డి చెబుతున్నారు. అది కూడా ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి వస్తాయని ఆయన అంటున్నారు.
అంటే 2024లోనే ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి కాబట్టి ఏపీలో ముందస్తు ఎన్నికలు లేనే లేవు అని భావించాల్సి ఉంటుంది. తాము ఏవరితోనూ పొత్తులు పెట్టుకోమని, ఈ విషయాన్ని పదే పదే స్పష్టం చేశామని అన్నారు. వైసీపీ గ్రౌండ్ లెవెల్ లో చాలా బలంగా ఉన్న పార్టీ అని అందుకే తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన అంటున్నారు.
అదే సమయంలో ఆయన మరో కామెంట్ కూడా చేశారు. చంద్రబాబుకు రాజకీయంగా ఉనికి చాటుకోవాలంటే ఊతకర్ర అవసరం అని అంటున్నారు. అందుకే ఆయన ప్రతీ ఎన్నికలోనూ పొత్తులతోనే వస్తారంటూ ఎద్దేవా చేసారు. బాబు ఎన్ని పార్టీలతో కలసినా ఎలా వచ్చినా కూడా ఓడేది టీడీపీ కూటమి అని గెలిచేది వైసీపీ అని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం తీవ్రమైంది. ముఖ్యంగా జగన్ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కలసి వచ్చిన తరువాత ఈ ప్రచారం మరింత ముమ్మరం అయింది. కేంద్ర పెద్దలకు ముందస్తు మాట చెప్పి జగన్ గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని అందుకే ఈ నెల 7న మంత్రి వర్గ సమావేశం అర్జంటుగా పెట్టారని, ఇక ఆ సమావేశంలోనే ముందస్తు మీద తేలుస్తారని, ఒక ముహూర్తం కూడా నిర్ణయిస్తారని ప్రచారం ఒక లెవెల్ లో సాగుతోంది.
తెలుగుదేశం అయితే మినీ మ్యానిఫేస్టోని రిలీజ్ చేసింది. చంద్రబాబు హడావుడిగా ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలసి వచ్చారు. పొత్తుల కోసమే ఇదంతా అని మరో వైపు ప్రచారం సాగుతోంది. వరస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఇపుడు వారాహి రధాని సడెన్ గా బయటకు తీసి అన్నవరం టూ భీమవరం యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఇంకో వైపు అమిత్ షా జేపీ నడ్డా ఏపీలో భారీ సభలతో బీజేపీని జనంలోని తీసుకెళ్లనున్నారు. ఇదంతా చూస్తూంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అంతా అంటున్నారు. కానీ అలాంటిది ఏమీ లేదని వైసీపీ ఎప్పటికపుడు ఖండిస్తూనే ఉంది. జగన్ దూకుడు చూస్తూంటే ముందస్తుకు వెళ్తారని అనుమాఇంచిన ప్రత్రీసారి సజ్జల రామకృష్ణారెడ్డి మరో మంత్రి ముందస్తా ఏమీ లేదు అంటూ ఖండించేసారు.
ఇపుడు ఆ పని పెద్దిరెడ్డి చేశారు. అయితే ఏ మంత్రి చెప్పినా సజ్జల వ్లాంటి వారు ఎన్ని సార్లు ప్రకటించినా ఏపీలో ముందస్తు ఎన్నికల మీద మాత్రం డౌట్లు అలాగే ఉన్నాయి. జగన్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. పైగా రాజకీయం అంటే వ్యూహాలు ఎత్తులు అందువల్ల లాస్ట్ మినిట్ లోనే జగన్ మార్క్ స్ట్రాటజీ ముందస్తు ఎన్నికల మీద బయ్తపెడతారు అని అంటున్నారు. ప్రస్తుతానికైతే పెద్దిరెడ్డి మాటే కరెక్ట్ అనుకోవాల్సి ఉంది.