పెగాసస్ స్పైవేర్ .. పార్లమెంటు సమావేశాల్లో అధికార, విపక్షాలు ఈ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ ఉదంతంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. స్పియర్, ఫిషింగ్ పద్ధతులను ఉపయోగించి టెక్స్ట్ లింక్‌లు లేదా మెసేజెస్ క్లిక్స్ ద్వారా మొబైల్ ఫోన్లలోకి స్పైవేర్ జోప్పించే స్థాయి నుంచి, జీరో-క్లిక్ అటాక్స్ ప్రయోగించే స్థాయికి ఎదిగిన స్పైవేర్ పద్ధతులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులను వణికిస్తున్న పెగాసస్ స్పైవేర్ ని అత్యంత శక్తివంతమైనదిగా టెక్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఫోన్ యూజర్ ఎలాంటి లింక్ ఓపెన్ చేయకపోయినా అసలు ఆ వ్యక్తి ప్రమేయం లేకపోయినా పెగాసస్ స్పైవేర్ మొబైల్ ని హ్యాక్ చేసేస్తుంది.
మానవ తప్పిదం లేదా మానవ ఇంటరాక్షన్ లేకుండానే జీరో క్లిక్ సైబర్ అటాక్స్ అనేవి పెగాసస్ వంటి స్పైవేర్లకు మొబైల్ ని కంట్రోల్ చేయడానికి సహాయ పడుతుంటాయి. నేరుగా సిస్టమ్ పైనే అటాక్ జరుగుతుంది కాబట్టి ఫిషింగ్ అటాక్ గురించి అవగాహన ఉన్నా, లేదా లింక్స్ పై క్లిక్ చేయకూడదు అని తెలిసినా ఎలాంటి ఉపయోగమూ ఉండదు. సాఫ్ట్ వేర్ పైన ఎక్కువగా జరిగే ఈ అటాక్స్ హానికరమైనవా కాదా అనేది నిర్ధారించడానికి సమయం కూడా ఉండదు. చాలా రహస్యంగా ఫోన్ లోకి చొరబడే ఈ స్పైవేర్లను గుర్తించడం కూడా చాలా కష్టం. ఈ ఏడాది ప్రారంభంలో సైబర్ సెక్యూరిటీ సంస్థ జెకాప్స్ ఐఫోన్ లు, ఐప్యాడ్ లు మెయిల్ అప్లికేషన్ ద్వారా అన్‌సిస్టెడ్ దాడులను ఎదుర్కొంటాయని తెలిపింది.
ఇదిలా ఉంటే .. దేశంలో పెగాసస్ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు తెలిపింది. చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన సరికాదని, ఈ విషయాన్ని కోర్టు సహించదని స్పష్టం చేసింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్ ప్రత్యక్ష బాధితులని తెలిపింది.
టెక్నాలజీ దుర్వినియోగంపై పరిశీలన చేస్తామని స్పష్టం చేసింది. కాగా, సీజేఐ ఎన్వీ రమ ణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పెగాసస్ పై వాదనలను విన్న తర్వాత సెప్టెంబరు 13న తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రముఖుల ఫోన్లను హ్యాక్ చేసినట్లు వచ్చిన ప్రచారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలివ్వాంటూ పలు వ్యాజ్యాలు దాఖలు కాగా వీటిపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగించింది. ఈ రోజు తీర్పు వెల్లడిస్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది