పోర్న్ చూడటం అనేది చాలా మందికి ఓ వ్యసనం. అయితే , పోర్న్ చూడటం మనదేశ చట్టం ప్రకారం నేరమేమి కాదు. కానీ, అందులో కూడా కొన్ని నియమాలు , నిబంధనలు ఉన్నాయి. భారత్‌లో చాలా పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం అమలులో ఉంది. కొన్ని వెబ్‌సైట్లు ‘‘మొరాలిటీ, డీసెన్సీ’’ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని చెబుతూ.. జులై 2015న 857 వెబ్‌సైట్లను భారత టెలికమ్యూనికేషన్ల విభాగం బ్యాన్ చేసింది. 2018లో ఈ బ్యాన్ ను మళ్లీ పొడిగించింది. ప్రస్తుతం ఈ వెబ్‌సైట్లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.
అంటే, ఈ వెబ్ సైట్లు ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిషేధం అమలులో ఉన్నప్పటికీ భారత్ లో పోర్న్ చూసే వారి సంఖ్య ఏమీ తగ్గలేదని 2018లో విడుదల చేసిన ఓ నివేదికలో పోర్న్ వెబ్ సైట్ పోర్న్‌హబ్ వెల్లడించింది. గూగుల్, యూట్యూబ్ తరహాలోనే పోర్న్‌హబ్ కూడా తమ యూజర్ల డేటాను విడుదల చేస్తుంది. 2020లో 2018నాటి గణాంకాలను పోర్న్ హబ్ వెల్లడించింది.
పోర్న్‌హబ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో బ్రిటన్, భారత్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య తేడా చాలా తక్కువగా ఉంది. సగటు భారతీయులు ఒక్కో వీడియోపై 8.23 నిమిషాలు వెచ్చిస్తున్నట్లు పోర్న్‌హబ్ తెలిపింది. మరోవైపు పోర్న్‌చూసే వారిలో 44 శాతం మంది 18 నుంచి 24ఏళ్ల వయసు వారేనని తెలిపింది. మరో 41 శాతం మంది 25 నుంచి 34ఏళ్ల మధ్య వయసువారని వెల్లడించింది. మొత్తంగా భారత్ లో పోర్న్‌చూసేవారి సగటు వయసు 29ఏళ్లు.
పోర్న్ హబ్ చూస్తున్న భారతీయుల్లో 30 శాతం మంది మహిళలు ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. మరోవైపు కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి లాక్ డౌన్ విధించిన సమయంలో మొదటి మూడు వారాల్లో పోర్న్ ట్రాఫిక్ భారత్ లో 95 శాతం పెరిగిందని ఏప్రిల్ 2020లో పోర్న్ హబ్ వెల్లడించింది. భారత్ లో నిషేధం అమలులోనున్న ఉన్నప్పటికీ వీపీఎన్ లు, ప్రోక్సీల ద్వారా నెటిజన్లు పోర్న్ ను చూస్తున్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు.
పోర్న్ వీక్షకులపై ఆంక్షలు విధించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం-2020, ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోస్కో) చట్టం-2012, భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లో నిబంధనలు ఉన్నాయి.సంక్షిప్తంగా చెప్పాలంటే భారత్ లో పోర్న్ చూడటం అనేది చట్ట విరుద్ధమైన చర్యేమీ కాదు. 2015 జులైలో సుప్రీం కోర్టు ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. తన సొంత గదిలో పోర్న్ చూడటం అనేది సదరు వ్యక్తి 'వ్యక్తిగత స్వేచ్ఛ' పరిధిలోకి వస్తుంది అని కోర్టు చెప్పింది. వ్యక్తిగత స్వేచ్ఛ గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పేర్కొన్నారు. ఈ స్వేచ్ఛపై ఏమైనా ఆంక్షలు విధించాలని భావిస్తే, కేంద్ర ప్రభుత్వం చట్టాలు తీసుకురావచ్చని రాజ్యాంగం చెబుతోంది.
2015లో ‘‘మొరాలిటీ, డీసెన్సీ’’ కిందే టెలికమ్యూనికేషన్ల విభాగం ఆంక్షలు విధించింది. అయితే, ఈ ఆంక్షలను బాలల అశ్లీల దృశ్యాల(చైల్డ్ పోర్నోగ్రఫీ)ను కట్టడిచేసేందుకు తీసుకొచ్చామని, వీటిని తాత్కాలికంగానే తీసుకొచ్చామని టెలికమ్యూనికేషన్ల విభాగం తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – (ఐటీ యాక్ట్) 2020లో నిబంధనల్లో సెక్స్ సమాచారాన్ని పబ్లిష్ చేసినా, ట్రాన్స్ మిట్ చేసినా నేరంగా పరిగణించేలా ఈ నిబంధనలను సిద్ధంచేశారు. ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 67 ప్రకారం.. శృంగార చర్యలను రికార్డుచేసి ఎలక్ట్రానిక్ రూపంలో పబ్లిష్ చేసినా, ట్రాన్స్ మిట్ చేసినా ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.10లక్షల వరకు ఫైన్ కూడా విధించే అవకాశముంది. రెండోసారి కూడా పట్టుబడితే గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు.
అదే సమయంలో, సెక్షన్ 66-ఇ ప్రకారం, సదరు వ్యక్తి అనుమతి లేకుండా ఆమె లేదా అతడి ప్రైవేటు భాగాల ఫోటోలు, వీడియోలను కావాలని లేదా అనుకుకోకుండా గానీ పబ్లిష్ చేసినా లేదా ట్రాన్స్‌మిట్ చేసినా గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశముంది. చైల్డ్ పోర్నోగ్రఫీ చట్ట వ్యతిరేకమని భారత ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టంచేసింది. భారత చట్టాలు చైల్డ్ పోర్నోగ్రఫీని తీవ్రమైన నేరంగా పరగిణిస్తున్నాయి. పబ్లికేషన్, ట్రాన్స్ మిషన్ తో పాటు బాలల అశ్లీల సమాచారం మీ దగ్గరున్నా, దాన్ని షేర్ చేసినా చట్టపరమైన చర్యలను ఎదుర్కొనే అవకాశముంది.
బాలల అశ్లీల దృశ్యాలను అడ్డుకోవడానికి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫమ్ సెక్షువల్ అఫెన్సెస్ (పోక్సో)లో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. అశ్లీల సమాచారం కోసం పిల్లల్ని ఉపయోగించుకుంటే ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చని పోక్సో చట్టంలోని సెక్షన్ 14 చెబుతోంది. రెండోసారి కూడా ఈ చట్టం కింద నేరం రుజువైతే ఈ శిక్షను ఏడేళ్లకు పెంచుతారు. జరిమానా దీనికి అదనంగా విధిస్తారు.
వేరే వారికి పంపడానికి, షేర్ చేయడానికి లేదా చూడటానికి, పబ్లిష్ చేయడానికి పిల్లల అశ్లీల దృశ్యాలను మన దగ్గర దాచుకున్నా కూడా నేరమేనని ఈ చట్టం చెబుతోంది. దీనికి జరిమానాలతోపాటు జైలు శిక్షలు కూడా విధించే అవకాశముంది. రూ. 5000ల నుంచి మొదలయ్యే ఈ జరిమానాలకు గరిష్ఠ పరిమితి అంటూ ఏమీలేదు. అంటే నేరం తీవ్రత ఆధారంగా ఈ జరిమానాలు ఉంటాయి. ముఖ్యంగా వెబ్‌సైట్లలో పెట్టేందుకు ఈ దృశ్యాలు, ఫోటోలను సేకరిస్తే, మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. పోక్సో చట్టం కింద కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ, బాలల అశ్లీల దృశ్యాలకు సంబంధించిన కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.