తెలంగాణలో మూడేళ్లలో 5వేల కోట్లు.. పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్లు.

Update: 2023-02-12 13:10 GMT
విద్యార్థులు ఉన్నతంగా చదివేందుకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయంబర్స్ మెంట్ ను పట్టించుకోవడం లేదు. వారికి ఇచ్చే స్కాలర్ షిప్ ల విషయంలోనే నిర్లక్ష్యంగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా గత మూడేళ్లలో సుమారు రూ.5 కోట్ల వరకు పెండింగులో ఉంచినట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కొన్ని కళాశాలల్లో సగం చెల్లిస్తున్నా.. మిగతా వాటిని ఏదో కారణం చెప్పి డబ్బులు చెల్లించకుండా ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తెస్తోంది.

ఉన్నత విద్య కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది.  మొదట్లో విద్యార్థులకు సరైన సమయంలో నిధులు విడుదల చేసి వారి చదువులకు తోడ్పాటునందించింది. కానీ మిగతా పథకాలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల రీయంబర్స్ మెంట్ పై ప్రభుత్వానికి లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఏబీవీపీ, ఏఏఎస్ఎఫ్ లాంటి సంఘాలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ప్రతీ సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు చెందిన 11 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.18, 653 కోట్లను విడుదల చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చాలా మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ అందడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

గత మూడేళ్ల నుంచి ప్రభుత్వం అరకొర నిధులను మాత్రమే విడుదల చేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు తెలుపుతున్నారు. వాస్తవానికి అకడమిక్ ఇయర్ ప్రారంభంలో 25 శాతం చెల్లించాలి. మధ్యలో  50 శాతం ఇవ్వాలి. చివరలో మిగతా మొత్తాన్ని విద్యార్థులకు చెల్లిస్తున్నారు. కానీ ఇయర్ ఎండింగ్ లోనే మొత్తం చెల్లిస్తుండడంతో విద్యార్థులతో యాజమాన్యం ముందే ఫీజులు కట్టించుకుంటోంది. కొందరు విద్యార్థుల ఖాతాల్లోకి పలు కారణాలతో నిధులు జమ కాకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు.

Similar News