ఏమీ లేని వృద్ధులు చాలా మంది ఉన్నారు. పింఛన్ కోసం చకోరా పక్షిలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ ఇవ్వండి సార్లూ అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు. అయినా కనికరించని అధికారులు ఎంతో మంది.. ప్రతి కలెక్టరేట్ లోనూ వృద్ధుల పడిగాపుల దృశ్యాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి.
అయితే ఏపీలో విచిత్రం చోటుచేసుకుంది. ఒక ఎమ్మెల్యే తల్లికి అధికారులు పింఛన్ ఇవ్వడం దుమారం రేపుతోంది. కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు తల్లి తులశమ్మకు పింఛన్లు ఇష్తున్న విషయం తాజాగా బయటపడింది. అదేసమయంలో నియోజకవర్గంలో ఎంతో అభాగ్యులకు పింఛన్లు తొలగిస్తున్నారని టీడీపీ ఆరోపించింది.
అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం లేదని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోలన చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు తల్లికి పింఛన్లు ఇస్తున్నారని.. అభాగ్యులకు తొలగిస్తున్నారని పంతగాని ఆరోపించారు.
ఈ క్రమంలోనే రైల్వే కోడూరు ఎంపీడీవో కార్యాలయానికి వృద్ధుడి వేషధారణలో వెళ్లి వినూత్న నిరసన తెలిపి ఫిర్యాదు చేశారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత తల్లికి ఇప్పటికీ పింఛన్ ఇస్తుండడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యే రూ.కోటి విలువ చేసే కారులో తిరుగుతున్నా ఆయన తల్లికి పింఛన్ ఇస్తున్నారని.. పేదల పింఛన్లు తొలగిస్తున్నారని.. ఇది ఎంతవరకు న్యాయమని నిలదీశారు.
కాగా పంతగాని నరసింహప్రసాద్ ఎంపీడీవో కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసి వెళుతుండగా ఆయనను కొందరు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి పరిస్థితి అదుపుచేశారు.