పరిచయం చేయాల్సిన అవసరం లేని ట్విటర్ కు కొత్త షాక్ ఎదురైంది. ట్విటర్ మాదిరే 'థ్రెడ్స్' పేరుతొ మైక్రో బ్లాగింగ్ యాప్ ను ఫేస్ బుక్ తీసుకురావటం తెలిసిందే. ట్విటర్ ను పోలిన ఈ ప్లాట్ ఫాంలో చేరేందుకు పలువురు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
డౌన్ లోడ్ చేసుకునేందుకు పచ్చ జెండా ఊపటానికి ముందే దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బుధవారం రాత్రి యాపిల్.. గూగుల్ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ లో థ్రెడ్స్ ను డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా అవకాశాన్ని కల్పించారు.
అమెరికా.. యూకే.. ఆస్ట్రేలియా.. కెనడా.. జపాన్ తో సహా వంద దేశాల వారికి అందుబాటులోకి వచ్చిన థ్రెడ్స్ యాప్ డౌన్ లోడ్స్ లో దుమ్ము రేపుతోంది. కేవలం 7 గంటల వ్యవధిలోనే కోటి మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవటం గమనార్హం. లైక్.. రిప్లై వంటి వాటికి ప్రత్యేకమైన బటన్లు ఉన్నాయి.
ఏ పోస్టుకు ఎన్ని లైక్ లు.. రిప్లైలు వచ్చాయో యూజర్లు తెలుసుకునే ఫీచర్ ను తీసుకొచ్చారు. ఒక పోస్టుకు 500 అక్షరాలు మించకూడదన్న పరిమితి ఉంది. ఇన్ స్టా యూజర్లు తమ అకౌంట్ల పేర్లతోనే థ్రెడ్స్ లో కొనసాగే వీలు కల్పించారు. దీంతో.. మరింత వేగంగా ఈ యాప్ విస్తరించే వీలుంది.
ఫేస్ బుక్ తీసుకొచ్చిన థ్రెడ్స్ దెబ్బకు ట్విటర్ కు షాక్ తప్పదన్న వాదనకు తగ్గట్లే.. డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించిన తొలి రోజునే దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున ఆసక్తిని వ్యక్తం చేస్తున్న వైనం చూస్తే.. ట్విటర్ దూకుడు కాస్తంత తగ్గ వీలుందంటున్నారు.
ఎప్పుడైతే ట్విటర్ యాజమాన్య హక్కులు మస్క్ చేతికి వచ్చాయో.. అప్పటి నుంచి ట్విటర్ యూజర్లకు కొత్త కండిషన్లు పెట్టిన వైనంపై గుర్రుగా ఉన్న వారు.. థ్రెడ్స్ రాకతో దానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు.