కరోనా: భద్రాద్రి రాముడికి తప్పలేదు..

Update: 2020-04-02 03:40 GMT
ఈరోజు శ్రీరామనవమి. గత ఏడాది అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలో శ్రీరాముల దేవాలయాల వద్ద కళ్యాణం, కమనీయంగా సాగేది. భద్రాద్రి శ్రీరాముడి కళ్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగలా చేసింది. కానీ నేడు కరోనా వైరస్ ధాటికి రామయ్య పెళ్లి కూడా టీవీలోనే చూడాల్సిన పరిస్థితి దాపురించింది.

దేశంలో లాక్ డౌన్ కారణంగా దేశంలోని ప్రముఖ ఆలయాలు అయిన భద్రాద్రి , ఒంటిమిట్ట, అయోధ్యలో ఈసారి సాదాసీదాగానే కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అయోధ్యలో భారీగా చేయాలనుకున్న కరోనా వైరస్ కారణంగా విరమించుకున్నారు. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. చివరకు కళ్యాణాన్ని జరిపించే పూజారులు కూడా మీటరు మీటరు దూరం కూర్చొని భద్రాద్రి రామయ్య కళ్యాణాన్ని జరిపిస్తున్న వైనం విస్తుగొలిపింది.

ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తున్నారు. దేవాలయంలోకి భక్తులను అనుమతించలేదు. లైవ్ లో టీవీలో కళ్యాణాన్ని ప్రసారం చేస్తున్నారు.  కొందరు ఆలయ అర్చకులు, భక్తులను దూరంగా దూరంగా కూర్చండబెట్టి ఓ 20 మంది సమక్షంలోనే స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులను కూడా నిర్ధిష్ట దూరంలో కుర్చునేలా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా ఆ దేవదేవుడు శ్రీరాముల వారికి కరోనా ధాటికి వేడుకలను వైభవంగా చేసుకునే భాగ్యం లేకుండా పోయింది.

Tags:    

Similar News