మన శరీరంలో A, B, AB, O అనే బ్లడ్ గ్రూపులుంటాయనే విషయం తెలిసిందే. ఈ నాలుగు బ్లడ్ గ్రూపులు మనిషిని బట్టి వేర్వేరుగా ఉంటాయి. అయితే ఈ బ్లడ్ గ్రూపులను బట్టి మనిషికి కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ అని ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) అధ్యయనం పేర్కొంది.
A, B, AB బ్లడ్ గ్రూపులు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) అధ్యయనం వెల్లడించింది. 4 లక్షల మందిని అధ్యయనం చేసి ఈ విషయాన్ని ప్రకటించింది.
ఈ అధ్యయనం ప్రకారం.. O బ్లడ్ గ్రూపులు ఉన్నవారి కంటే.. A లేదా B బ్లడ్ గ్రూప్‌లు ఉన్న వ్యక్తులకు గుండెపోటు వచ్చే అవకాశం 8 రెట్లు ఎక్కువ అని వెల్లడైంది.
అలాగే యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ కూడా అధ్యయనం ఇదే విషయాన్ని పేర్కొంది. 13.6 లక్షల మందిని యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ విశ్లేషించింది. O బ్లడ్ గ్రూపుతో పోలిస్తే మిగిలిన బ్లడ్ గ్రూపులవారికి కరోనరీ, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం 9 శాతం ఎక్కువగా ఉంటుందని షాకింగ్ విషయాలు వెల్లడించింది.
కాగా O గ్రూపుతో పోలిస్తే... B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 15 శాతం ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంటున్నాయి. O గ్రూపుతో పోలిస్తే... A బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం 11 శాతం ఎక్కువ.
అదేవిధంగా O నెగెటివ్ బ్లడ్ గ్రూప్ మినహా అన్ని బ్లడ్ గ్రూపుల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం, రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అధ్యయనాలు వెల్లడించాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.