మొన్న HDFC, ICICI , నేడు బజాజ్ ఫైనాన్స్ ..పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పెట్టుబడి !

Update: 2020-09-22 01:30 GMT
ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజాలు హెచ్‌ డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో చైనాకు సంబంధించిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పెట్టుబడులు పెట్టింది. తాజాగా భారత్‌ లోని అతిపెద్ద ఎన్బీఎఫ్‌ సీలలో ఒకటైన బజాజ్ ఫైనాన్స్‌లోను ఈక్విటీ ఇన్వెస్ట్ చేసింది. కరోనా వైరస్, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, చైనా పై డిజిటల్ స్ట్రైక్ ‌ల నిషేధం సమయంలో చైనా సెంట్రల్ బ్యాంకు HDFC లో పెట్టుబడులు పెట్టడం ఆర్థిక మార్కెట్లో కలకలం రేపింది. ఇదే సమయంలో గత నెలలోను మరో ప్రయివేటు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులోను ఇన్వెస్ట్ చేసింది. తాజాగా బజాజ్ ఫైనాన్స్‌ లో పెట్టుబడులు పెట్టింది.

భారత్‌ లోని ఆర్థిక సంస్థల్లో చైనా బ్యాంకు ఇన్వెస్ట్ చేయడం ఇది మూడోది. మార్చిలో HDFC బ్యాంకులో తన వాటాను ఒక శాతం కంటే ఎక్కువకు పెంచుకుంది. ఆ తర్వాత ఐసీఐసీలోను ఇన్వెస్ట్ చేసింది. హెచ్‌ డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్‌ లో చైనా బ్యాంకు ఇన్వెస్ట్ చేసింది తక్కువ మొత్తమే అయినా కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టడం ఆందోళన కలిగించే అంశం. బ్యాంకింగ్ రంగంలో ఏ పెట్టుబడిదారు అయినా 15 శాతానికి మించి పెట్టలేరు. 5 శాతానికి మించి పెడితే ఆర్బీఐ అమోదం అవసరం. గాల్వాన్ లోయ ఘటన సమయంలో హెచ్‌ డీఎఫ్‌సీ బ్యాంకు పెట్టుబడులు వెలుగు చూశాయి. ఇటీవల సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు పెట్టుబడులు వచ్చాయి ఐసీఐసీఐ బ్యాంకు గత నెలలో రూ.15,000 కోట్ల నిధుల సమీకరణలో భాగంగా ఈ పెట్టుబడులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యుషనల్ ప్లేస్ ‌మెంట్ కింద చైనా బ్యాంకు రూ.15 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది.
Tags:    

Similar News