ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా పేరు చెప్తేనే భయంతో వణికిపోతోంది. ఇంకా పలు దేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. అలాగే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అయితే , ఇప్పుడిప్పుడే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండటంతో అందరికీ ఒకే సారి కాకుండా , దశల వారీగా టీకా ను ఇస్తూ వస్తున్నారు. అయితే ,కరోనా వ్యాక్సిన్ నియమ నిబంధనలు ఉల్లంఘించి ఇద్దరు మహిళలు అక్రమంగా కరోనా టీకాను తీసుకున్నారు. ఇందుకు తమను తాము పెద్దవారిలా కనిపించేలా వేషధారణ మార్చి అధికారులను బురిడీ కొట్టించారు. ఈ ఘటన అమెరికాలోని ఓర్లాండోలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే .. 35, 45 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు తమకు 65పైబడినట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని , దానికితగ్గట్టే పెద్దవారిలా మారువేషం వేసుకొని కోవిడ్ టీకా సెంటర్కు చేరుకున్నారు. అక్కడ వారి పేర్లు, సంబంధిత రిజిస్ట్రేషన్ ఐడీతో సరిపోలడంతో అధికారులు వారికి వ్యాక్సిన్ మొదటి డోస్ ను వేసి ఇంటికి పంపించారు. అయితే, ఆ తర్వాత వారి పుట్టినతేదీ వివరాలు మ్యాచ్ కావడం లేదని తర్వాత పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలు చేసిన టీకా మోసంతో అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఈ విషయంపై వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు. అయితే వారు ఏ సెంటర్ నుంచి మొదటి డోస్ వ్యాక్సిన్ పొందారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మీకంటే అత్యంత ఎక్కువ అవసరం ఉన్న వారి వద్ద నుంచి మీరు వ్యాక్సిన్ను దొంగిలించారు అని ఆరోగ్యశాఖ ప్రతినిధి తెలిపారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాలని, అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. అసలు ఆ మహిళలు ఎవరి నుంచి అపాయ్ంట్మెంట్ పొందారు, ఈ విషయంలో ఎవరైనా సహాయం చేశారా వంటి విషయాలపై సమగ్ర దర్యాప్తునకు అధికారులు ఆదేశాలు జారీచేశారు.