గులాబీ జెండా ను పవన్ వెనుక జేబు లో పెట్టుకుంటారా?

Update: 2023-06-15 17:04 GMT
అంచనాలకు తగ్గట్లే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన అధినేత సినిమాల్ని వదిలి.. ప్రజాక్షేత్రం లోకి వచ్చినంతనే ఏపీ అధికారపక్ష నేతల్లోని పలువురు చెలరేగిపోవటం.. తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

వారాహి విజయ యాత్ర పేరు తో నిర్వహిస్తున్న కార్యక్రమం నిన్నటి (బుధవారం) నుంచి మొదలైంది. తొలి రోజున కత్తిపూడి బహిరంగ సభ లో సుదీర్ఘంగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. తన ఆలోచనల్నితెలియజేసే ప్రయత్నం చేశారు. ఇందు లో భాగంగా ఏపీ అధికారపక్షంపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ని సూటిగా టార్గెట్ చేశారు.

ఈ నేపథ్యంలో పవన్ పై దుమ్మెత్తి పోసేందుకు సిద్ధమయ్యారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు కు చెంచాగా మారారన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. అదే సమయంలో.. ఏపీ మీద కేసీఆర్ చేసే విమర్శల పైన పవన్ ఎందుకు రియాక్టు కారంటూ సూటి ప్రశ్నను సంధించారు.

ఈ క్రమంలో ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. పవన్ సినిమాలు రిలీజ్ అయ్యే వేళలో.. ఏ సినిమా ను అయినా ఏపీ ప్రభుత్వంఆపిందా? అంటూ ప్రశ్నించిన పేర్నినాని..అదే తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లకు పవన్ కల్యాణ్ మొక్కుతారన్నారు.

పవన్ తన సినిమా ను రిలీజ్ అయ్యే వేళ లో ఆయన కాళ్లకు మొక్కుతారని.. గులాబీ జెండా ను తన బ్యాక్ జేబు లో పెట్టుకొని తిరుగుతారంటూ తీవ్రమైనవ్యాఖ్యల్ని చేశారు. నిజంగానే పవన్ కల్యాణ్ అలా చేస్తారా? అంటే లేదనే మాట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తో పవన్ కల్యాణ్ కు మాత్రమే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చెబుతారు.

అలాంటప్పుడు పవన్ కల్యాణ్ కు కేసీఆర్ తోను ఆయన కుమారుడి తోనే పంచాయితీ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. పవన్ ను ప్రశ్నించే వైసీపీ నేతలు.. తాము అతమ అధినేత సైతం కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటారన్న విషయాన్ని వదిలేసి.. పవన్ ను టార్గెట్ చేస్తే అంత సూట్ కాదన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ వ్యాఖ్యల పై పవన్ ఏ రీతి లో రియాక్టు అవుతారో చూడాలి.

Similar News