తెలుగుదేశం వైసీపీల మధ్య ఉప్పు నిప్పులా రాజకీయం ఉంటుంది. సాధారణ రాజకీయానికి భిన్నంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తాయి అని అంటారు. రాజకీయ ప్రత్యర్ధుల కంటే శత్రువుల మాదిరిగా వీరి మధ్య అతి పెద్ద గ్యాప్ ఒకటి ఉంటూ వస్తోంది. అలాంటిది ఈ రెండు పార్టీలను కలిపేదే అసెంబ్లీ. అక్కడ తెలుగుదేశం వైసీపీ నేతలు కలుస్తారు. అయితే గతంలో ఉండే సన్నిహిత్యంతో కూడిన మాటలు, ఒకరిని ఒకరు మెచ్చుకోవడాలు లాంటివి అంత పెద్దగా కనిపించవు.
ఎందుకంటే పార్టీల రాజకీయం ఇరు పార్టీల ఎమ్మెల్యేలను అంతలా విడదీస్తోంది అని చెప్పాలి. అయితే అలాంటి వాటికి భిన్నంగా ఒక అరుదైన దృశ్యమే ఏపీ అసెంబ్లీలో ఈ రోజు చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నాని, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఒకరికి ఒకరు తారసపడ్డారు. ఇద్దరూ కొద్ది సేపు బాగా మాట్లాడుకున్నారు
అయితే ఆ మాటల్లో కూడా తమ సొంత పార్టీ రాజకీయ లక్షయాలకు అనుగుణంగానే సాగాయి అంటున్నారు. పేర్ని నాని అయితే ఉరవకొండ ఎమ్మెల్యే అయిన పయ్యావుల కేశవ్ ని మరోసారి మీరే ఆ సీటు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పడం విశేషం. దాని వెనక అర్ధం ఏంటి అంటే ఉరవకొండలో తెలుగుదేశం ఎపుడు గెలిచినా ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి రాదు. 2014లో ఆ సీటుని వైసీపీ గెలుచుకుంది. అపుడు ఏపీలో టీడీపీ నెగ్గింది.
ఇకపోతే 2019లో పయ్యావుల కేశవ్ గెలిచారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దానికంటే ముందు చూస్తే 2004, 2009లలో కూడా పయ్యావుల కేశవ్ టీడీపీ తరఫున గెలిచారు. ఆ రెండు ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోయింది. ఒక విధంగా చెప్పాలీ అంటీ టీడీపీకి ఉరవకొండ సీటు యాంటీ సెంటిమెంట్ గా మారింది. ఎందరో మంత్రులు అయ్యారు.
కానీ సీనియర్ మోస్ట్ లీడర్ పయ్యావుల కేశవ్ మాత్రం మినిస్టర్ అని పిలిపించుకోలేకపోతున్నారు అంటే ఆయన గెలిచిన ప్రతీ సారీ పార్టీ ఓడిపోవడమే కారణం.
అందుకే 2024లో కూడా పయ్యావులనే గెలవమని పేర్ని నాని చాలా చమత్కారంగా అంటున్నారు అన్న మాట. అదే జరిగితే ఏపీలో మరోసారి ఏపీలో వైసీపీ జెండా ఎగురుతుందన్న్నది పేర్ని నాని ఆలోచన. మరి రాజకీయంగా గట్టి నేత అయిన పయ్యావుల ఈ సంగతి తన గెలుపు వెనకాల వైసీపీ నేత కోరికను పసిగట్టలేరా. అందుకే ఆయన కూడా బాగానే జవాబు ఇచ్చారు. 1994లో మాదిరిగా ఉరవకొండలోనూ గెలుస్తాం, ఏపీలోనూ అధికారాన్ని సాధిస్తామని ముప్పయ్యేళ్ళ నాటి పాత ముచ్చటను ముందు పెట్టారు.
ఆ ఎన్నికల్లో ఉరవకొండలోనూ టీడీపీ గెలిచింది. అన్న గారి నాయకత్వంలో అద్భుతమైన విజయాన్ని ఏపీలోనూ కూడా సాధించింది. మరి పేర్ని నాని అయితే 2019 ఫలితానే రిపీట్ చేయమని కోరుకుంటున్నారు. పయ్యావుల తానూ గెలుస్తానూ టీడీపీ గెలుస్తుంది అంటున్నారు. ఇంతకీ 2024 ఎన్నికల్లో ఉరవకొండ ఫలితం 2014 మాదిరిగా ఉంటుందా లేక 2019గా ఉంటుందా అన్నది తెలియాలంటే ఏడాది పాటు ఆగాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.