వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. జగన్‌పై విమర్శలు కాదు.. జనం కోసం బతుకు పవన్ కళ్యాణ్ అంటూ.. మాటల తూటాలు పేల్చారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడని ధ్వజమెత్తారు. రైతులకు పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూల రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.
6 నెలలకు ఒకసారి పవన్ రోడ్డుపైకి వస్తున్నాడని పేర్ని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ విమర్శించేవాడని దుయ్యబట్టారు. విమర్శలు చేసేందుకే ఇప్పుడు మళ్లీ రోడ్డుపైకి వస్తున్నాడని ఫైర్ అయ్యారు. 'జనం కోసం పట్టుమని 10 రోజుల పనిచేశావా పవన్? కాపులను బీసీల్లో చేరుస్తామని హమీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశాడు. చంద్రబాబు కాపులను మోసం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించ లేదు`` అని పేర్ని నిలదీశారు.
చంద్రబాబు ప్రభుత్వం కాపు నేత ముద్రగడ కుటుంబాన్ని హింసించినప్పుడు పవన్ షూటింగుల్లో బిజీగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాడితే దాడి చేశారని, ఆనాడు పవన్ కల్యాణ్ ఎందుకు నోటికి తాళం వేసుకున్నాడని నిలదీశారు.
చంద్రబాబులా కాపులను మోసం చేయనని జగన్ ముందే చెప్పారని పేర్ని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే రిజర్వేషన్లు ఉంటాయని నిజాయితీగా చెప్పారని అన్నారు. కాపులను దగా చేసింది చేసింది చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాదా? అని నిలదీశారు.
భీమ్లాకు నష్టాలా?
భీమ్లా నాయక్ సినిమాకు ఏపీలో నష్టాలు వచ్చాయంటున్నారని, కానీ సినిమా బాగుంటేనే జనం చూస్తారని పవన్ వ్యాఖ్యానించారు. `` రూ.100 కోట్లు దాటిన పవన్ కల్యాణ్ సినిమా ఏదైనా ఉందా? రూ.100 కోట్ల మార్కెట్టే లేనప్పడు రూ.30కోట్ల నష్టం ఎలా వస్తుంది? డబ్బింగ్, కాపీ సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు? రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది పవన్ కల్యాణ్ కాదా? కుల ప్రస్తావన లేకుండా ఒక్కరోజైనా మాట్లాడారా? చంద్రబాబును తిడితే మాత్రమే పవన్‌కు మానవత్వం పొంగిపొర్లుతుందా? టీడీపీ నేతలు నీ గురించి బరి తెగించి మాట్లాడితే ఏం చేశావ్? మీరిద్దరు కలిసిపోతారు, కలిసి పోటీ చేయాలని మొదటి నుంచి చెబుతున్నాం. చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఒకటే`` అని పేర్ని నిప్పులు చెరిగారు.