పెగాసెస్ పై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో గురువారం నాడు పిటిషన్ దాఖలైంది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సిట్ ను ఏర్పాటు చేయాలని , సిట్ తో పెగాసెస్ పై విచారణ జరిపించాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోరారు. ఈ విషయమై న్యాయవాది ఎంఎల్ శర్మ రిట్ సుప్రీం కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘా పెట్టింది అని ప్రభుత్వం పై ఆరోపణలు రావడంతో దీనిపై ప్రస్తుతం దేశంలో తీవ్రమైన చర్చ జరుగుతుంది.
2016 నుండి ఈ సంస్థ యొక్క ఖాతాదారులైన ఎన్ ఎన్ ఓ గ్రూప్ సుమారు 50 వేల ఫోన్ నెంబర్లను లక్ష్యంగా చేసుకొందని ఆ పిటిషనర్ ఆరోపణలు చేశాడు. ఈ విషయాన్ని మీడియా ప్రస్తావించినట్టుగా పిటిషన్ లో పొందుపరిచాడు. ప్రధాని, మంత్రులు స్వంత ప్రయోజనాల కోసం భారత పౌరులపై విరుచుకుపడటానికి రాజ్యాంగం అనుమతించాలని అని పిటిషన్ ప్రశ్నించారు. అనుమతి లేకుండా పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయడం భారత చట్టాలను ఉల్లంఘిస్తోందన్నారు.
విపక్ష నాయకులు, న్యాయవ్యవస్థ సభ్యులతో సహా భారత పౌరులపై నిఘా పెట్టడం నేరమని పిల్ లో పిటిషనర్ పొందుపరిచాడు.పెగాసెస్ కేవలం నిఘా సాధనం మాత్రమే కాదు, ఇది భారతీయ రాజకీయాలపై విరుచుకుపడుతున్న సైబర్ ఆయధమని పిటిషనర్ అన్నారు. ఈ సాఫ్ట్ వేర్ వాడకం జాతీయ భద్రతా ప్రమాదానికి గురి చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.