స్వలింగ వివాహాలను గుర్తించాలని పిటీషన్

Update: 2021-12-01 02:30 GMT
ప్రత్యేక హిందూ, విదేశీ వివాహ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలను గుర్తించాలని దాఖలైన పిటీషన్లపై విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ పిటీషన్ దాఖలైంది. అయితే దాఖలైన పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రం స్పందన కోరింది.

ప్రధాన న్యాయమూర్తి డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై సూచనలను స్వీకరించడానికి, సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం తరుఫు న్యాయవాదికి సమయం ఇచ్చింది.

ఈ అంశాన్ని ఫిబ్రవరి 3న తదుపరి విచారణకు వాయిదా వేసింది. ప్రత్యేక, హిందూ, విదేశీ వివాహ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలను గుర్తిస్తూ డిక్లరేషన్ ఇవ్వాలని కోరుతూ పలువురు స్వలింగ జంటలు దాఖలు చేసిన పిటీషన్ పై కోర్టు విచారణ చేపట్టింది.

కొంత మంది పిటీషనర్ల తరుఫున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ దేశంలోని మొత్తం జనాభాలో ఏడెనిమిది శాతానికి సంబంధించిన హక్కుల దృష్ట్యా , ప్రొసిడింగ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయడం తప్పనిసరి అని సమర్పించారు.

ఇది జాతీయ, రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత కలిగిన విషయమని ఆయన ధర్మాసనానికి వివరించారు. ప్రత్యక్ష ప్రసారం అధిక జనాభాకు ఆతిథ్యం ఇవ్వగలదని ఆయన పేర్కొన్నారు.

కౌల్ తన క్లయింట్లు ఈ కేసుల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంతో మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. పెద్ద సంఖ్యలో ప్రజలు విచారణకు హాజరు కావాలనుకున్నప్పటికీ సాంకేతిక ఫ్లాట్ ఫారమ్ ల పరిమితి కారణంగా వారు అలా చేయలేకపోతున్నారని ఆయన వెల్లడించారు.

ఇక సుప్రీంకోర్టు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, బార్ జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుకూలంగా ఉన్నాయని ఈ పిటీషన్లు ఈ కోవలోకే వస్తాయని ఆయన అన్నారు.
Tags:    

Similar News