దున్నపోతు మీద వానపడితే ఏం అవుతుంది.? ఏం కాదు.. ఎలాంటి చలనం దానికి ఉండదు. ఇప్పుడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీరు కూడా అలానే ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కరోనా-లాక్ డౌన్ తో ప్రజల చేతిలో రూపాయి లేని పరిస్థితి. రూపాయి రూపాయికి జనం వెతుక్కుంటున్నారు. ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి అరిగోసపడుతున్నారు. అమెరికా, యూరప్, జపాన్ లో ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వేసి వారి ఆర్థిక పరిస్థితి దిగజారకుండా అక్కడి ప్రభుత్వాలు కాపాడుతున్నాయి.కానీ మన మోడీసార్ మాత్రం ఆ ఒక్కటి అడక్కండి అంటున్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎటు పోయిందో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇంతటి క్లిష్ట సమయంలో మోడీసర్కార్ దోపిడీకి పాల్పడుతోంది. ఈ దోపిడీ అవసరమా మోడీజీ అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల నెత్తిన భారం మోపి దోచుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనికరం లేని బీజేపీ సర్కార్ పై ఆడిపోసుకుంటున్నారు.
20 లక్షల కోట్లు అంటూ ప్రకటించిన మోడీ ప్యాకేజీ ఒట్టి గాలిబుడగ అని తేలిపోయింది. ప్రజల ఉద్యోగాలు నిలబడలేదు. జీతాల లోటు భర్తీ కాలేదు. ఏ పథకమూ దరిచేరలేదు. వట్టి గ్యాస్ అని తెలంగాణ సీఎం సహా దేశంలోని సీఎంలంతా మోడీజీ ప్యాకేజీపై నిప్పులు పోశారు.
పోనీ పథకాలు , ఆర్థిక సాయం చేయడంలో మోడీకి చేయి రాలేదు సరే.. కనీసం ధరలు అయినా పెంచకపోతే ప్రజలు బతుకుతారు కదా అంటే.. దాని మీద మోడీ సార్ శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా వ్యవహరిస్తున్నారని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు మేలు చేయాల్సిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ వారి నెత్తిన భారం మోపుతోంది. ధరలు తగ్గించాల్సిందిపోయి విపరీతంగా పెంచుతూ దోచుకుంటోంది. వరుసగా 18వ రోజు కూడా పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతూ మోడీ సర్కార్ దేశ ప్రజలకు వాతలు పెడుతోంది. అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 20 డాలర్లకు పడిపోయినా కానీ ఆ తగ్గింపును ప్రజలకు మరల్చకుండా మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర వరుసగా 18వ రోజునాడు పెంచేశారు. ఈ 18 రోజుల్లో మోడీ ప్రభుత్వం పెట్రోల్ పై లీటర్ కు 8.50 రూపాయలు పెంచింది. ఇక డీజిల్ పై ఏకంగా లీటర్ 10.50 రూపాయలు పెంచడం గమనార్హం.
ఇలా సామాన్యుడికి ఆదాయం లేకుండా చేసి ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకు వస్తున్న ప్రజల ఆదాయాన్ని పెట్రోల్, డీజిల్ తో పీల్చిపిప్పి చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు సామాన్యులు. ఇంత కరువులో ఈ పెంచుడేంది మోడీసార్ అంటూ నిలదీస్తున్నారు.